వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RRR:ఆ ఎమ్మెల్యేలతో రెబల్ ఎంపీ ఇష్యూ ముడిపడి ఉందా: రఘురామ ధీమా అదే : వైసీపీ అస్త్రం సిద్దం..!!

By Lekhaka
|
Google Oneindia TeluguNews

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు పైన అనర్హత వేటు వేయాలని వైసీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. లోక్ సభ స్పీకర్ కు రెండో సారి రఘరామ పైన ఫిర్యాదు..తగిన ఆధారాలు వైసీపీ లోక్ సభ విప్ మర్గాని భరత్ అందించారు. ఆ తరువాత రఘురామ సైతం స్పీకర్ ను కలిసి ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి..తాను ఫిర్యాదు చేసిన వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. మరో వైపు తాను పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని..సమస్యలు-లోపాలు మాత్రమే ప్రస్తావించానని చెబుతూ..తన మీద అనర్హత వేటు సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైసీపీ నేతలు మాత్రం జగన్ ఢిల్లీ పర్యటన తరువాత మరింత బలంగా రఘురామ మీద వేటు ఖాయమని చెబుతున్నారు.

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అంశం పైన..

టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల అంశం పైన..

పార్టీ వెబ్ సైట్ నుండి ఎంపీగా తన పేరు తొలిగించటం ద్వారా..తనను పార్టీ నుండి బహిష్కరించారా అంటూ రఘురామ రాజు లేఖ ద్వారా ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించారు. ఇది ఇలా కొనసాగుతున్న సమయంలోనే ఇటు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారం పైన చర్చ మొదలైంది. టీడీపీ నుండి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి దగ్గరయ్యారు. అధికారికంగా కాకున్నా...అనధికారికంగా అధికార పార్టీకి జై కొట్టారు. అందులో వల్లభనేని వంశీని టీడీపీ సస్పెండ్ చేసింది. వెంటనే తనను పార్టీ సస్పెండ్ చేసిందని..తనకు వేరే సీటు కేటాయించి స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని వంశీ నేరుగా స్పీకర్ ను కోరగా ఆయన అంగీకరించారు. అదే విధంగా మద్దాలి గిరి, కరణం బలరాం, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ టీడీపీకి దూరమయ్యారు.

 ఎమ్మెల్సీల విషయంలో మాత్రం..

ఎమ్మెల్సీల విషయంలో మాత్రం..

ఆ నలుగురు వైసీపీ కండువా కప్పుకోలేదు. ప్రభుత్వాన్ని మాత్రం ప్రశంసిస్తున్నారు. ముఖ్యమంత్రి శాసనసభ తొలి సమావేశంలోనే ఒక అంశం స్పష్టం చేసారు. ఏ పార్టీ వారైనా తమ పార్టీలోకి రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసిన తరువాతే రావాలని..అలా చేయకుంటే మీరే వారి పైన అనర్హత వేటు వేయండి అంటూ సభా వేదికగా స్పీకర్ ను కోరారు. ఎమ్మెల్సీలు శమంతకమణి... పోతుల సునీత.. డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాత్రం టీడీపీకి రాజీనామా చేసిన తరువాతనే వైసీపీలో చేరి..ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు అటు టీడీపీతో లేరు..ఇటు వైసీపీలో అధికారికంగా చేరలేదు.

రఘురామ రాజు తొలి నుండీ..

రఘురామ రాజు తొలి నుండీ..

అదే పరిస్థితి రఘురామ రాజు వ్యవహారంలోనూ కనిపిస్తోంది. ఆయన వైసీపీని వీడలేదు. తాను ఇష్టపడే బీజేపీలో చేరలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు..హాహభావాలు మాత్రం అభ్యంతరకంగా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి..పార్టీ నేతల మీద చేసిన వ్యాఖ్యలను అందరూ తప్పు బడుతున్నారు. ఇక, తమ ఎమ్మెల్యేల గురించి టీడీపీ బలంగా ప్రశ్నించలేని బలహీన పరిస్థితి. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా వైసీపీ నుండి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వటంతో..ఇప్పుడు కనీసం తమ పార్టీ నుండి వైసీపీకి అనధికారికంగా దగ్గరైన వారి పైన చర్యలు తీసుకోమనే డిమాండ్ సైతం బలంగా చేయలేకపోతోంది. ఇప్పుడు ఢిల్లీలో ఎంపీ రఘురామ వ్యవహారంతో ఇక్కడ ఎమ్మెల్యేల అంశానికి పొంతన ఉందా..లేదా అనే చర్చ సాగుతున్నా... వైసీపీ మాత్రం ఖచ్చితంగా రఘురామ రాజు పైన అనర్హత వేటు కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Recommended Video

Ap Capital Moving to vizag on July 23 | Fans Remembering Sushant as he left this world on this day.
వైసీపీ అస్త్రం సిద్దం..

వైసీపీ అస్త్రం సిద్దం..


పార్టీ పైన రఘురామ విమర్శలు..సీఎం ఆగ్రహం తెలిసిన వెంటనే రఘురామ అప్పట్లోనే హైకోర్టులో పార్టీ తనను సస్పెండ్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. ఇక, రఘురామ రాజు వరుసగా జగన్ కు లేఖలు రాస్తూ చెల్లించాల్సిన బకాయిలు అంటూ రోజకో అంశం ప్రస్తావిస్తున్నారు. దీనికి సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు గట్టిగా సమాధానం ఇస్తున్నారు. ముందు బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి..ఆ తరువాత ప్రశ్నించాలంటూ కౌంటర్లు వేస్తున్నారు. అంతిమంగా వైసీపీ..ఎంపీని పార్టీ నుండి బహిష్కరిస్తే ఆటోమేటిక్ గా ఆయన లోక్ సభ సభ్యత్వం రద్దు అవుతుందనే వాదన ఉంది. కానీ, అందులో ఉన్న సాంకేతిక...న్యాయ పరమైన అంశాలు అధ్యయనం చేస్తున్న పార్టీ నేతలు...లోక్ సభ స్పీకర్ ద్వారా ఆ నిర్ణయం అమలు జరిగితే ఎటువంటి ఇబ్బంది ఉండదనే డెసిషన్ కు వచ్చారు. దీంతో..ఢిల్లీ కేంద్రంగా చివరి అస్త్రం పైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది.

English summary
MP Raghu Rama Raju episode in Loksabha and four tdp rebel mla's issue in Assembly now became a hot topic in political cirlces. YSRCP demanding disqualify on Raghu Rama Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X