India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ సర్కార్ తీరుపై ఉద్యోగుల గరంగరం-ఎమర్జెన్సీ సర్వీసుల నిలిపివేత హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మద్యంతర భృతిని వడ్డీ లేని రుణం మాత్రమేనంటూ సీఎస్ సమీర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వారికి మంటపుట్టించాయి. దీంతో ఇవాళ సమావేశమైన పీఆర్సీ సాధన సమితి వీటిపై చర్చించింది. అనంతరం మాట్లాడిన ఉద్యోగసంఘాల నేతలు సీఎస్ వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

అనమోలిస్ కమిటీ అంటున్న అధికారులకు దానిపై అవగాహన లేనట్టుందని పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. వేతన సవరణ లో ఒక సీనియర్ ఉద్యోగికి జూనియర్ కన్నా అన్యాయం జరిగితే దానిని పరిష్కరించడానికి ఈ కమిటీ పని చేస్తుందని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వం ఉద్యమాన్ని చంపేందుకు కొన్ని ఎత్తుగడలు వేస్తోందని, ఇప్పుడు అనామలిస్ కమిటీ ఎక్కడుందో ఉద్యోగులు వెతుక్కోవాలా అని ప్రశ్నించారు. వేతన గణన అనేది అర్ధం కాని బ్రహ్మ పదార్దంలా అధికారులు మార్చేశారని బండి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కు పిచ్చి పట్టిందో మాకు పట్టిందో అర్ధం కావడం లేదన్నారు. అసుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను పక్కన పెట్టి అధికారుల కమిటీ నివేదిక అమలు చేసి అన్యాయం చేసేశారన్నారు. ఓ వైపు అభ్యంతరాలు చెప్పుకునే సమయంలో నే చీకటి జీవోలు ఇచ్చారని బండి గుర్తుచేశారు. అదే సమయంలో ఉద్యోగులను భయపెట్టేలా బదిలీలు చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు.
ప్రభుత్వ ఎత్తుగడలను ఉద్యోగులు, ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇదే తరహా లో వ్యవహారం చేస్తే ఎమెర్జెన్సీ సర్వీసులు నిలిపివేస్తామిని బండి హెచ్చరించారు.

ap prc steering committee counter attack on cs sameer sharma comments on ir as interest free loan

మధ్యంతర భృతి వడ్డీ లేని అప్పుగా సీఎస్ లాంటి ఉన్నతాధికారి మాట్లాడటం వితండవాదమని పీఆర్సీ సాధన సమితి నేతలోని మరో నేత కె.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. పీఆర్సీకి డీఏ కి ఏదన్నా సంబంధం ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రతీ ఉద్యోగికి కేంద్రం ఆదేశాల మేరకు చెల్లింపు ఉంటుందన్నారు. సీఎం చుట్టూ ఉన్న సలహాదారు లకు లెక్కలు తెలీదని, ఉద్యోగులకు మాత్రమే వారి వేతన వివరాలు తెలుస్తాయన్నారు. దీని గమనంలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.

సీఎం ఓ కార్యాలయ అధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వం లో ఉన్న పెద్దలు బలవంతంగా ఉద్యోగులను సమ్మెలోకి నెట్టారని పీఆర్సీ సాధన సమితి నేతలో మరో నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యోగుల చలో విజయవాడను బలప్రదర్శన గా చెబుతున్న ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని కుటుంబంలా చూడటం లేదా అని ప్రశ్నించారు. ఉద్యోగులను శత్రువులుగా ప్రభుత్వం భావిస్తోందా అని నిలదీశారు. రాజకీయ ప్రసంగాలు ఉద్యోగులకు అవసరం లేదన్నారు. సమ్మె చేస్తే ఉద్యోగులకు ఆనందం ఎలా అవుతుందన్నారు.

Budget 2022: Andhra Pradesh ప్రస్తావనే లేదు..మొక్కుబడిగా కేటాయింపులు| AP CM Jagan | Oneindia Telugu

జీతాలు కూడా రావని, తమ బాధలు వినడానికి ఆఖరి అస్త్రం గా మాత్రమే తప్పనిసరై సమ్మెలోకి వెళ్తున్నామని బొప్పరాజు తెలిపారు. గత అక్టోబర్ లొనే పీఆర్సీ ఇస్తామన్నారని, చర్చలు జరిగిన ప్రతీ సారీ అవమానపరుస్తున్నారన్నారు. 14 సార్లు చర్చలకు పిలిచినా ఏం ఉపయోగం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల తో బహిరంగ చర్చలకు సిద్ధమా చెప్పాలన్నారు. సమ్మెలోకి వెళ్తే ఆ జీతాలు కూడా మిగుల్చుకోవచని ప్రభుత్వ కుట్ర పన్నుతోందన్నారు. ప్రజల నుంచి కూడా ఉద్యోగుల కు సహకారం అందించారన్నారు. వారు స్వచ్ఛంద గానే చలో విజయవాడలో నీరు మజ్జిగ ఇచ్చారన్నారు. ఇప్పటికీ చర్చలకు సిద్ధమే కానీ ప్రభుత్వం అందరినీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రుల కమిటీ ఇదే చేసిందని బొప్పరాజు తెలిపారు. ఐఏఎస్ అధికారుల జీతాలు వేసేది కూడా మా ఉద్యోగులేనని ఆయన వ్యాఖ్యానించారు.

English summary
ap prc steering committee on today reacts on chief secretary sameer sharma's comments on interim relief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X