వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర పన్నుల్లో తెలంగాణ కంటే ఆంద్రప్రదేశ్ కు అధిక నిధులు కారణమదేనా?

కేంద్రం నుండి 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.29,138 కోట్లు కేంద్రం నుండి నిధులు దక్కనున్నాయి. తెలంగాణ కంటే రెట్టింపు నిధులు ఆంద్రప్రదేశ్ కు దక్కాయి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: కేంద్రం నుండి 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.29,138 కోట్లు కేంద్రం నుండి రానున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కంటే ఆంద్రప్రదేశ్ రెట్టింపు నిధులు కేంద్రం నుండి రానున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ, తేదిన బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ఆధారంగా ఆయా రాష్ట్రాలు తమ బడ్జెట్ లను రూపొందించుకోనున్నాయి.

ఈ ఏడాది నుండి జిఎస్ టి ని అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం.అయితే జిఎస్ టి ని అమలుచేయడం ద్వారా నష్టపోయే రాష్ట్రాలను ఆదుకోవాలని కేంద్రం కోరుతున్నాయి రాష్ట్రాలు.

మరోవైపు కేంద్ర బడ్జెట్ లో శాఖల వారీగా కేటాయింపులు చేయడం వల్ల ఆయా రాష్ట్రాలకు ఆయాశాఖలకు ఏ మేరకు నిధులు దక్కనున్నాయో అనే విషయమై కూడ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణ కంటే ఆంద్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు

తెలంగాణ కంటే ఆంద్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు

కేంద్ర బడ్జెట్ ఆధారంగా 2017-18 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ కంటే ఎక్కువ నిధులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కనున్నాయి.తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో 16,508 కోట్ల దక్కనున్నాయి. అయితే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో 29,138 కోట్లు దక్కనున్నాయి. తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రెట్టింపు నిధులు వస్తాయి.కేంద్రపన్నుల్లో ఆంద్రప్రదేశ్ కు 4.3 శాతం చొప్పున రూ.29,138 కోట్లు, తెలంగాణకు 2.43 శాతం చొప్పున రూజ16,505 కోట్లు దక్కనున్నాయి.

పన్నుల ద్వారా వచ్చే నిధులను 42 శాతం రాష్ట్రాలకే

పన్నుల ద్వారా వచ్చే నిధులను 42 శాతం రాష్ట్రాలకే

14వ, ఆర్థిక సంఘం సిపారసులను కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు 6,74,565 కోట్లను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 42 శాతం నిధులను కేటాయించనుంది. ఈ మేరకు రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తోంది కేంద్రం. ఈ ఆర్థిక సంవత్సరం నుండే ఈ రకంగా నిధులను కేంద్రం కేటాయిస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్ కు అధిక నిధులు

ఉత్తర్ ప్రదేశ్ కు అధిక నిధులు

దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేంద్రం నుండి రానున్నాయి. ఏకంగా 17.96 శాతం వాటా దక్కనుంది. ఆ రాష్ట్రానికి రూ.1,21,406 కోట్లు దక్కనున్నాయి.అత్యధిక జనాభా , అత్యధి పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు ఉన్న రాష్ట్రంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్టానికి అత్యధికంగానే నిధులు దక్కనున్నాయి.

 సిక్కిం రాష్ట్రానికి అతి తక్కువ నిధులు

సిక్కిం రాష్ట్రానికి అతి తక్కువ నిధులు

దేశంలోని సిక్కిం రాష్ట్రానికి అతి తక్కువ నిధులు కేంద్రం నుండి దక్కనున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కు రూ.1,21,406 కోట్లు దక్కితే, సిక్కిం రాష్ట్రానికి రూ.2,477 కోట్లు మాత్రమే దక్కుతాయి.సిక్కిం తర్వాత రూ.2,550 కోట్లతో గోవా తర్వాతి స్థానంలో నిలిచింది.

English summary
ap receives rs.29,138 crores for 2017-18 financial year,ap state receives more than telangana state from central for 2017-18 financial year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X