• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ ప్లాన్ బూమరాంగ్-అవసరంగా కెలుక్కున్నారా ? రిటైర్డ్ ఇంజనీర్ల హెచ్చరికలు

|

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో ఆయన చేపట్టిన పలు చర్యలు ప్రశంసలు అందుకుంటుండగా.. కొన్ని మాత్రం బూమరాంగ్ కాక తప్పడం లేదు. ఇందులో తాజాగా చోటు చేసుకున్న ఓ అంతర్ రాష్ట్ర వివాదంపై జగన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయనతో పాటు రాష్ట్రానికీ ఇబ్బందిగా మారింది. భవిష్యత్తులో ఏపీ ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగించడం ఖాయంగా కనిపిస్తున్న ఈ నిర్ణయంపై రిటైర్డ్ ఇంజనీర్లూ భగ్గుమంటున్నారు.

 మలుపుతిప్పిన జగన్ నిర్ణయం

మలుపుతిప్పిన జగన్ నిర్ణయం

ఏపీ విభజన సందర్భంగా కేంద్రం నుంచి హామీలు పొందడంలో సక్సెస్ అయిన రాజకీయ పార్టీలు వాటి అమలులో మాత్రం కేంద్రాన్ని ఒప్పించలేకపోతున్నాయి. దీంతో రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు కానీ హామీలు కానీ ఏమాత్రం అమలు కావడం లేదు. దీనిపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న తరుణంలో సీఎం జగన్ తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం ఈ మొత్తం వ్యవహారానికి ఓ కీలమైన మలుపుగా మారింది. పైకి చూసేందుకు చాలా సింపుల్ గా కనిపించిన ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉంది. దీంతో ఈ నిర్ణయం పర్యవసానాలపై అభ్యంతరాలు మొదలయ్యాయి.

 కేంద్రానికి పెత్తనం ఇచ్చిన జగన్

కేంద్రానికి పెత్తనం ఇచ్చిన జగన్

ఏపీ, తెలంగాణ మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు కలిగిన కృష్ణా, గోదావరి నదులపై పెత్తనాన్ని సీఎం జగన్ తాజాగా కేంద్రానికి అప్పగించారు. తెలంగాణతో ఏర్పడిన జల వివాదం నేపథ్యంలో కేంద్రం పెత్తనాన్ని ఆయన కోరారు. దీంతో స్పందించిన కేంద్రం.. ఏపీ, తెలంగాణలో ప్రాజెక్టుల్ని తమ పరిధిలోకి తీసుకొస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై మరో మాటకు తావు లేదని కూడా తేల్చిచెప్పేసింది. దీంతో ఇప్పుడు దాని పర్యవసానాలపై చర్చ మొదలైంది. తొలుత తాము కోరిన విధంగా రివర్ బోర్డులకు నోటిఫికేషన్ వచ్చేసిందని సంబరపడిన జగన్ సర్కార్.. ఇప్పుడు దాని పర్యవసానాల్ని తలచుకుని కుంగిపోయే పరిస్ధితి కనిపిస్తోంది. అందుకే దీనిపై నోరు మెదిపేందుకు కూడా ఇష్టపడటం లేదు.

 జగన్ ప్లాన్ బూమరాంగ్

జగన్ ప్లాన్ బూమరాంగ్

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తెచ్చుకుంది. దీంతో స్ధూరంగా ఇరు రాష్ట్రాలకు నష్టం కలుగుతుంది. అదే సమయంలో ఏపీకి మరి కాస్త ఎక్కువ నష్టం వాటిల్లబోతోంది. కృష్ణా, గోదావరి నదుల నుంచి వచ్చే నీరు వాడుకునే చివరి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దీంతో పైనున్న తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర దయతలిస్తే కానీ ఏపీకి నీరు వచ్చే పరిస్ధితి లేదు. ఇలాంటి సమయంలో రాష్ట్ర జాబితాలో ఉన్న ఇక్కడి ప్రాజెక్టులు, వాటిలో నీటి వాటాలు కూడా కేంద్రానికి జగన్ అప్పగించేశారు. దీంతో కేంద్రం చెప్పినట్లు ఆడక తప్పని పరిస్ధితి నెలకొంది. ఇది భవిష్యత్తుల్లో రాష్ట్ర సాగు, తాగునీటి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

  Janasena Silence Over BJP's Fight Against AP Govt| YSRCP | Tippu Sultan | AP | Oneindia Telugu
   రిటైర్డ్ ఇంజనీర్ల హెచ్చరికలు

  రిటైర్డ్ ఇంజనీర్ల హెచ్చరికలు

  కృష్ణా, గోదావరి నదీ జలాల వాడకంలో అంతిమ రాష్ట్రంగా ఉన్న ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం వీటిపై ప్రాజెక్టులను తమ పరిధిలోకి తెచ్చుకోవడంపై రిటైర్డ్ ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం ఇచ్చే జీతాలతో పనిచేస్తున్న జలవనరుల శాఖ సిబ్బందిపై పెత్తనం కృష్ణా, గోదావరి రివర్ బోర్డులు తీసుకోవడమేంటని సీఎం జగన్ ను రిటైర్డ్ ఇంజనీర్లు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల జాబితాలో ఉన్న నదీ జలాల వ్యవహారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టడం సరికాదంటున్నారు. కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ వరకే కేంద్రం పరిధిలో ఉంచాలని వారు సీఎం జగన్ ను కోరారు. ఈ మేరకు కేంద్రంతో లాబీయింగ్ చేసి మన ప్రయోజనాలు కాపాడాలని, అవసరమైతే కోర్టులకు వెళ్లి మరీ కేంద్రం పెత్తనం లేకుండా చూడాలని రిటైర్డ్ ఇంజనీర్లు జగన్ ను డిమాండ్ చేస్తున్నారు.

  English summary
  andhrapradesh chief minister ys jagan's plan on hand over of irrigation projects to central government seems to be boomerang with objections from retired engineers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X