వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మర్కజ్ మత ప్రార్థనల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి: ఢిల్లీకి వెళ్లిన మాట నిజమే.. కానీ: అంజద్ భాషా క్లారిటీ

|
Google Oneindia TeluguNews

కడప: యావత్ దేశాన్ని ఆందోళనలోకి నెట్టేసిన ఉదంతం ఢిల్లీ మత ప్రార్థనలు. దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో నిర్వహించిన సామూహిక మత ప్రార్థనల్లో వందలాది మంది పాల్గొనడం, వారిలో చాలామందికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో అన్ని రాష్ట్రాలు ఉలిక్కి పడ్డాయి. ఈ మత ప్రార్థనల్లో పాల్గొని, స్వస్థలానికి చేరుకున్న వారి గురించి ఆరా తీస్తున్నాయి. దొరికిన వారిని దొరికినట్టుగా ఐసొలేషన్ వార్డులకు తరలిస్తున్నాయి.

ఇవే మత ప్రార్థనల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా కూడా పాల్గొన్నారనే వార్తలు కడప జిల్లాలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మత ప్రార్థనలు జరిగే సమయంలో ఆయన ఢిల్లీలోనే ఉన్నారని అంటున్నారు. మత ప్రార్థనల్లో పాల్గొనడానికి వ్యక్తిగతంగా ఢిల్లీకి వెళ్లారని, మర్కజ్ మసీదులో నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారనే వార్తలు కలకలం రేపాయి. ఆయనకు కూడా క్వారంటైన్‌కు తరలించాలనే డిమాండ్ వినిపించింది.

 Aps Deputy CM Amjad Basha denied as participate in Markaz prayers

ఈ వార్తలను అంజద్ భాషా తోసిపుచ్చారు. క్లారిటీ ఇచ్చారు. కిందటి నెల 2వ తేదీన తాను ఢిల్లీకి వెళ్లానని, ఆ మరుసటి రోజే రాష్ట్రానికి తిరిగి వచ్చానని తెలిపారు. మత ప్రార్థనలు జరిగే సమయంలో తాను ఢిల్లీలో లేనని అన్నారు. ఓ వ్యక్తిగత కేసుకు సంబంధించిన విషయంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలవడానికి తాను కిందటి ఢిల్లీకి వెళ్లానని చెప్పారు. 3వ తేదీన న్యాయవాదిని కలిశానని, అదేరోజు కడపకు చేరుకున్నానని వివరణ ఇచ్చారు.

ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటించి: తన పని తాను చేసుకుంటోన్న వుహాన్: షియోమి డోర్లు ఓపెన్ప్రపంచానికి కరోనా వైరస్‌ను అంటించి: తన పని తాను చేసుకుంటోన్న వుహాన్: షియోమి డోర్లు ఓపెన్

5వ తేదీన ముఖ్యమంత్రి నిర్వహించిన మంత్రివర్గ సమావేశానికి కూడా హాజరయ్యానని అన్నారు. ఢిల్లీలో ఉన్న సమయంలో నమాజ్ చేయడానికి స్థానిక మసీదును సందర్శించానే తప్ప మర్కజ్ మత ప్రార్థనల్లో పాల్గొనలేదని అంజద్ భాషా స్పష్టం చేశారు. 5వ తేదీ నుంచి తాను కడపలోనే ఉన్నానని, లాక్‌డౌన్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, రెవెన్యూ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను నిర్వహిస్తున్నానని చెప్పారు.

English summary
Andhra Pradesh Depputy Chief Minister Amjad Basha is also participated in Markaz community prayers at Markaz building in Nizamuddin in New Delhi, reports said. Later, Amjad Basha is denied the reports that He did not participate the Markaz prayers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X