వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ .. సీఎం కుర్చీలో ఎన్టీఆర్.. మార్ఫింగ్ ఫోటో వైరల్

|
Google Oneindia TeluguNews

ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటమిని చవిచూసింది. అంతటి దారుణమైన ఓటమి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఊహించలేకపోయారు. కేవలం ఇరవై మూడు స్థానాలకే టిడిపి పరిమితం కావడం దేశవ్యాప్త చర్చకు కారణమైంది. ఇక అప్పటినుండి నేటి వరకు పాలన చేపట్టిన జగన్ ఎనిమిది నెలల పాలన రోజుకో రగడతో కొనసాగుతుంది.ఇక చంద్రబాబు సీఎం జగన్ ను ధీటుగాఎదుర్కునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ టీడీపీకి కొత్త నాయకత్వం కావాలనే చర్చ జోరుగా సాగుతుంది. ఇక ఈ సమయంలో మరోమారు తెరపైకి యువనాయకుడి అంశం వచ్చింది .

 మరోమారు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పై చర్చ

మరోమారు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పై చర్చ


టిడిపిని నామరూపాలు లేకుండా చేయాలని, చంద్రబాబు హయాంలో అవినీతిని బయట పెట్టాలని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నాడు. అందులో రాజధాని మార్పు అంశం కూడా ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది . చంద్రబాబు తాజా పరిణామాల నేపధ్యంలో ఎంత గట్టిగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాన్ని మాత్రం కదిలించలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో టీడీపీకి మళ్ళీ పొలిటికల్ గా మైలేజ్ రావాలంటే జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపాలని కొందరు నేతలు తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

సీఎం కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో వైరల్

సీఎం కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో వైరల్


ఇప్పటికే పలు మార్లు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే పార్టీలోని ముఖ్య నేతలు, పెద్దలు మాత్రం ఎవరొచ్చినా చంద్రబాబు నాయకత్వంలోనే ముందుకు నడవాలని అది ఎన్టీఆర్‌కు సైతం వర్తిస్తుందని తేల్చి చెప్తున్నారు . ఇప్పటికే పలు మార్లు జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల గురించి ఏ మాత్రం స్పందించలేదు . ఇక ఇప్పుడు ఏకంగా సంక్రాంతి వేళ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి హడావిడి చేసిన వారు, సీఎం కుర్చీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో మార్ఫ్ చేసి భవిష్యత్ సీఎం ఎన్టీఆర్ అని ఫోటో వైరల్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ సంక్రాంతికి ఫ్లెక్సీ ..

ఎన్టీఆర్ కాబోయే సీఎం అంటూ సంక్రాంతికి ఫ్లెక్సీ ..

సంక్రాంతి సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీనే పెద్ద చర్చకు కారణం అయ్యింది. ఆ ఫ్లెక్సీలో రాబోయే కాలానికి కాబోయే సీఎం.. 2024 ఏపీ ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అంతేకాదు అందులో చంద్రబాబు ఫోటో కూడా లేకుండా ఫ్లెక్సీ వేయించారంటే చంద్రబాబు మీద విముఖత స్పష్టంగా గోచరిస్తుంది. . ఇక ఈ ఫ్లెక్సీని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావు అనుచరులు ఏర్పాటు చేశారు.

సీఎం కుర్చీలో ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో ... చంద్రబాబుకు తలనొప్పి

సీఎం కుర్చీలో ఎన్టీఆర్ మార్ఫింగ్ ఫోటో ... చంద్రబాబుకు తలనొప్పి


ఇక ఇప్పుడు తాజాగా భరత్ అనే నేను సినిమాలో మాదిరిగా ఎన్టీఆర్ సీఎం కూర్చిలో కూర్చున్న మార్ఫింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో టీడీపీలో జోరుగా ఎన్టీఆర్ పై చర్చ జరుగుతుంది .ఆంధ్రప్రదేశ్ లో 2024 జరిగే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేసి గెలిచేదెవరని అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తున్న తీరు, ఇప్పటి నుంచే అప్ కమింగ్ సీఎం అంటూ ఫ్లెక్సీలు, మార్ఫింగ్ ఫోటోలు హల్చల్ చేస్తున్న తీరు టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది .

English summary
While the reference of NTR is taking place in recent politics, a Flexi in Prakasham district stole the whole limelight. The matter in the Flexi states that NTR will be the next CM of AP in 2024 and fans ever made slogans supporting NTR. another post also viral in telugu states . In CM's chair junior NTR marphed photo viral in social media causes a big debate in TDP .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X