వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో మరో పంచాయతీ పోరు- నోటిఫికేషన్‌ విడుదల- ఎక్కడెక్కడంటే

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత నెలలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నాలుగు దశల్లో జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్జాయి. అయితే అప్పట్లో పలుచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులే ముందుకు రాని పరిస్ధితి పలు చోట్ల ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్ధానాలకు మరోసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం 13 జిల్లాల్లో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మార్చి 15న ఆయా స్ధానాల్లో ఎన్నికల పోలింగ్‌ ఉంటుందని ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Recommended Video

AP Municipal Elections: AP SEC Nimmagadda to Visit Visakhapatnam
ఏపీలో మరో పంచాయతీ పోరు

ఏపీలో మరో పంచాయతీ పోరు

ఏపీలో పంచాయతీ ఎన్నికలను గత నెలలో నాలుగు దశల్లో నిర్వహించారు. అప్పట్లో దాదాపుగా ఎన్నికల ప్రక్రియ పూర్తయినా పలుచోట్ల మాత్రం నామినేషన్లు వేసేందుకు అభ్యర్ధులే దొరకని పరిస్దితి తలెత్తింది. రాజకీయ వివాదాలు, ఇతరత్రా కారణాలతో కూడా అభ్యర్ధులు నామినేషన్లు వేయలేదు. దీంతో అక్కడ ఎన్నికలే నిర్వహించేందుకు వీల్లేకుండా పోయింది. అలాంటి స్ధానాల్లో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఆయా చోట్ల ఎన్నికలకు వీలు కల్పిస్తూ తాజాగా ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఏపీలో మరో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది.

13 సర్పంచ్‌లు, 725 వార్డు సభ్యుల ఎన్నిక

13 సర్పంచ్‌లు, 725 వార్డు సభ్యుల ఎన్నిక

శ్రీకాకుళం జిల్లాలో రెండు సర్పంచ్ స్ధానాలకు, విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో సర్పంచ్‌, నెల్లూరు జిల్లాలో 4, కడపలో రెండు సర్పంచ్‌ స్ధానాలు, కర్నూలులో ఓ సర్పంచ్‌ స్ధానానికి, అనంతపురంలో ఓ సర్పంచ్ స్ధానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే 13 జిలాల్లో మొత్తం 725 వార్డు సభ్యుల స్ధానాలకు ఈసారి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇవన్నీ గతంలో నామినేషన్లు దాఖలు కాని స్ధానాలే. ఈసారి ఆయా చోట్ల ఎన్నికలను ప్రోత్సహించేందుకు జిల్లాల కలెకర్లు ప్రయత్నాలు చేయాల్సి ఉంది.

పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమైన తేదీలివే

పంచాయతీ ఎన్నికల్లో ముఖ్యమైన తేదీలివే

ఈసారి పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. రేపటి నుంచి ఆరో తేదీ వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 7న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఈ నెల 10 వరకూ గడువు ఇచ్చారు. ఈ నెల 15న ఈ 12 పంచాయతీలు, 725 వార్డు సభ్యుల స్ధానాల్లో ఎన్నికల పోలింగ్‌ నిర్వహిస్తారు. పోలింగ్‌ ముగియానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించబోతున్నారు.

English summary
andhra pradesh state election commision on wednesday issued notification for left over seats of sarpanches and ward members of gram panchayats in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X