వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డ వెనుకడుగు -గవర్నర్‌తో ‌భేటీ తర్వాత - కలెక్టర్ల కాన్ఫరెన్స్ రద్దు -మళ్లీ హైకోర్టుకు ఎస్ఈసీ?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్, జగన్ సర్కారు మధ్య కొనసాగుతోన్న విభేదాల పరంపరలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించవద్దంటూ ప్రభుత్వ ప్రధన కార్యదర్శి నీలం సాహ్ని తేల్చిచెప్పడంతో తొలిసారి ఎస్ఈసీ వెనుకడగు వేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ ముగిసిన కాసేపటికే నిమ్మగడ్డ తన అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం.

కన్నకూతురిపై లాయర్ అత్యాచారం -పదేపదే కోరడంతో పాప ఆత్మహత్యాయత్నం -భార్య ఫిర్యాదుకన్నకూతురిపై లాయర్ అత్యాచారం -పదేపదే కోరడంతో పాప ఆత్మహత్యాయత్నం -భార్య ఫిర్యాదు

వీడియో కాన్ఫరెన్స్ రద్దు

వీడియో కాన్ఫరెన్స్ రద్దు


ఏపీలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థలు నిర్వహించాలని డిసైడైన ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆ మేరకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయితీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని భావించారు. ఈ భేటీకి సంబంధించి మంగళవారమే ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కుదరదని, ఎస్ఈసీ తన ఆలోచనను విరమించుకోవాలని ప్రభుత్వం తరఫున సీఎస్ నీలం సాహ్ని ఘాటు లేఖ రాశారు. సీఎస్ లేఖపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ.. సర్కారు తీరుపై గవర్నర్ హరిచందన్ కు సైతం ఫిర్యాదు చేశారు. కానీ చివరికి ఆయనే కలెక్టర్లతో కాన్ఫరెన్స్ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటన చేశారు.

నిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామనిమ్మగడ్డ రాజీనామా -జగన్ ఫర్మానా -ఏపీలో ఆర్టికల్ 356 -సుప్రీం తీర్పు ఇదే: ఎంపీ రఘురామ

గవర్నర్ నుంచి లభించని హామీ?

గవర్నర్ నుంచి లభించని హామీ?


స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం ఆజమాయిషీ చేయాలనుకోవడం తగదంటూ సీఎస్ నీలం సాహ్నికి ఇచ్చిన రిప్లైలో ఎస్ఈసీ నిమ్మగడ్డ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మధ్యాహ్నం తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషన్ తో సుమారు అరగంట భేటీ అయిన నిమ్మగడ్డ.. సీఎస్ లేఖ వ్యవహారంతోపాటు సర్కారు తీరుపై ఫిర్యాదు చేశారు. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు కరోనాను కారణంగా చూపుతున్నారని, ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఎన్నికలతో లింక్‌ చేసి ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఈసీ.. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీకి ఫేవర్ గా గవర్నర్ నుంచి ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. గవర్నర్ తో భేటీ ముగిసిన వెంటనే కాన్ఫరెన్స్ రద్దు చేసుకుంటున్నట్లు నిమ్మగడ్డ ప్రకటించడం ద్వారా ఈ విషయం స్పష్టంగా వెల్లడైందనే వాదన వినిపిస్తోంది. దీంతో..

నిమ్మగడ్డ వర్సెస్ జగన్..

నిమ్మగడ్డ వర్సెస్ జగన్..

కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని సీఎస్ ద్వారా అధికారికంగా చెప్పించిన ప్రభుత్వం.. మరోవైపు మంత్రుల ద్వారానూ తన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంచేస్తోంది. మంత్రి కొడాలి నానితోపాటు వైసీపీ ముఖ్యులు బుధవారం ఉదయం నుంచే పలు మార్లు మీడియా ముందుకొచ్చి.. ఎస్ఈసీ తీరుపై ఆక్షేపణలు చేశారు. కరోనా ప్రమాదం పూర్తిగా తొలిగిన తర్వాతే ఎన్నికలు పెడతామని, నిమ్మగడ్డ తొందరపడటంలో అర్థంలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మోకాలడుత్తోందని తెలసికూడా నిమ్మగడ్డ తనదైన శైలిలో ముందుకు వెళుతూ ఎస్ఈసీ వాదనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ వర్సెస్ నిమ్మగడ్డగా అభివర్ణిస్తోన్న ఈ విభేదాలు మళ్లీ..

మళ్లీ కోర్టుకు నిమ్మగడ్డ?

మళ్లీ కోర్టుకు నిమ్మగడ్డ?

ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి అధికారాలు ఎస్ఈసీ నిమ్మగడ్డవేనని, ఆయనకు ప్రభుత్వం సహకరించాల్సిందేనని ఇప్పటికే ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులు స్పష్టం చేశాయి. అయితే ప్రభుత్వం మాత్రం కరోనా పరిస్థితులు, ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని కరాకండిగా చెబుతోంది. బుధవారం నాటి పరిణామాలతో కాన్ఫరెన్స్ రద్దు ద్వారా వెనుకడుగు వేసిన నిమ్మగడ్డ రమేశ్ తిరిగి హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని కోర్టు తీర్పు చెబితే గనుక అది జగన్ సర్కారుకు శరాఘాతం కానుంది.

English summary
andhra pradesh State Election Commissioner Nimmagadda Ramesh Kumar on Wednesday cancelled the scheduled video conference with district collectors and SPs after Chief Secretary Nilam Sawhney wrote a letter to him raising objection over the meeting. sec decision came after his meeting with ap governor harichandan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X