అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌ సర్కార్‌పై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు-సజ్జలను తప్పించండి- కోర్టు కెళతానంటూ

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న జగన్‌ సర్కార్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సాగిస్తున్న తనపై మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, సలహాదారులు చేస్తున్న విమర్శలపై నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా తన పని తాను చేసుకుపోతుంటే ప్రభుత్వ పెద్దలు తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని ఫిర్యాదు చేశారు. అంతేకాదు సర్కారు పెద్దల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

వ్యూహం మార్చిన నిమ్మగడ్డ- సంప్రదాయాలకు గుడ్‌బై - ఏకగ్రీవాలకు చెక్‌వ్యూహం మార్చిన నిమ్మగడ్డ- సంప్రదాయాలకు గుడ్‌బై - ఏకగ్రీవాలకు చెక్‌

 సర్కారు తీరుపై నిమ్మగడ్డ సీరియస్‌

సర్కారు తీరుపై నిమ్మగడ్డ సీరియస్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం తనకు సహకరిస్తున్నట్లు నటిస్తూనే మరోవైపు కత్తులు దూస్తున్న వ్యవహారంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ ఆగ్రహంగా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు సహకరిస్తున్నట్లు కనిపిస్తున్నా.. అంతర్గంతగా తన ఆదేశాలేవీ పాటించకపోవడం, మంత్రులు, సలహాదారులు తనపై రోజూ బహిరంగ విమర్శలకు దిగుతుండటంపై నిమ్మగడ్డ సీరియస్‌ అయ్యారు. దీంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా వీటికి అడ్డుకట్ట వేసేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గవర్నర్‌ హరిచందన్‌కు ఆయన ఇవాళ ఓ లేఖ రాశారు.

సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు లేఖ

సజ్జలను తప్పించాలని గవర్నర్‌కు లేఖ

పంచాయతీ ఎన్నికల విషయంలో తనను రోజూ టార్గెట్‌ చేస్తున్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై గవర్నర్‌కు నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. సజ్జల ప్రభుత్వ సలహాదారుగా ఉంటూ పార్టీ ఆఫీసు నుంచి తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు రాసిన లేఖలో ఎస్‌ఈసీ ఆరోపించారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని నిమ్మగడ్డ తెలిపారు.
సుప్రీంకోర్టులో కేవియట్‌ వేసిన తనకు వ్యతిరేకంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని గవర్నర్‌కు నిమ్మగడ్డ గుర్తుచేశారు. సజ్జల వ్యాఖ్యలపై తదుపరి చర్యలకు అటార్నీ జనరల్‌ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను ఆయన కోరారు.

మంత్రుల విమర్శలు కోడ్‌ ఉల్లంఘనే

మంత్రుల విమర్శలు కోడ్‌ ఉల్లంఘనే

ఏపీలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఏకంగా ఎన్నికలు నిర్వహిస్తున్న తనపైనే నిత్యం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తప్పుబట్టారు. మంత్రుల విమర్శలు కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తాయని గవర్నర్‌కు తెలిపారు. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స లక్ష్మణరేఖ దాటి తనపై విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. మంత్రుల విమర్శలపై గవర్నర్‌ తగు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

సర్కారు విమర్శల దాడిపై కోర్టుకెళతానన్న నిమ్మగడ్డ

సర్కారు విమర్శల దాడిపై కోర్టుకెళతానన్న నిమ్మగడ్డ

ప్రభుత్వంలో భాగంగా ఉన్న మంత్రులు, సలహాదారులు తనపై ఉద్దేశపూర్వంకంగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని గవర్నర్‌కు చేసిన ఫిర్యాదులో నిమ్మగడ్డ పేర్కొన్నారు. వీటిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ పదవిలో ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని గవర్నర్‌కు నిమ్మగడ్డ సూచించారు. అయితే
సజ్జలపై చర్యల విషయంలో అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం సుబ్రహ్మణ్యంపై తనకు నమ్మకం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. అందుకే
అటార్నీ జనరల్‌ నుంచి న్యాయ సలహా తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. అదే సమయంలో ప్రభుత్వం తనపై చేస్తున్న విమర్శల దాడిపై కోర్టును ఆశ్రయిస్తానని గవర్నర్‌కు నిమ్మగడ్డ తెలిపారు. అంతకంటే ముందే మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు.

English summary
ap sec nimmagadda complains governor against jagan government, warns to move court
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X