• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జగన్‌ సర్కార్‌తో ముగిసిన పోరు-హైకోర్టు ఆదేశాలు-ఎన్నికలపై నిమ్మగడ్డ కీలక సిఫార్సులు

|

ఏడాది క్రితం దాదాపు ఇదే సమయానికి స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదాతో తెరపైకి వచ్చిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ తన పదవీకాలం ముగియడంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ ఏడాది కాలంలో జగన్ సర్కారుతో ముఖాముఖీ పోరు చేసి మరీ స్ధానిక సంస్ధల ఎన్నికలను తాను అనుకున్నట్లుగా పూర్తి చేసిన నిమ్మగడ్డ.. మధ్యలో పలుమార్లు హైకోర్టు తలుపుతట్టారు. దీంతో ఎన్నికల వ్యవస్ధలో మార్పులు చేయకపోతే తాము కూడా ఏమీ చేయలేని పరిస్ధితి ఉందని చెప్పిన హైకోర్టు... రిటైర్ అయ్యేలోపు ఎన్నికల సంస్కరణలపై ఓ నివేదిక సమర్పిచాలని ఆయన్ను ఆదేశించింది. దీంతో నిమ్మగడ్డ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేశారు.

 జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరుతో లోపాలు బహిర్గతం

జగన్‌ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరుతో లోపాలు బహిర్గతం

రాష్టాల్లో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘానికి రాజ్యాంగంలో స్పష్టమైన అధికారాలు, బాధ్యతలు, హక్కులు ఉన్నప్పటికీ వాటి అమలు చేసే విషయంలో స్ధానిక పంచాయతీరాజ్, మున్సిపల్‌ చట్టాల్లో లొసుగులు నిమ్మగడ్డకు సమస్యలు తెచ్చిపెట్టాయి. ఎన్నికల నిర్వహణ, వాయిదా, తిరిగి నిర్వహణ వంటి విషయాల్లో ఎస్ఈసీ అధికారాల్ని జగన్ సర్కారు గతంలో ఎప్పుడూ లేనంత స్ధాయిలో ప్రశ్నించింది. అంతే కాదు తమకు అనుకూలంగా వ్యవహరించని కమిషనర్‌ నిమ్మగడ్డను ఆర్డినెన్స్‌ తెచ్చి మరీ సాగనంపింది. తిరిగి హైకోర్టు ఆదేశాలతో పదవిలోకి వచ్చిన ఆయన తన అధికారాల్ని వాడుకునే విషయంలో పలుమార్లు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. మొత్తం మీద జగన్ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరుతో వ్యవస్ధల్లో ఉన్న లోపాలు బహిర్గతమయ్యాయి.

 నిమ్మగడ్డకు హైకోర్టు కీలక సూచన

నిమ్మగడ్డకు హైకోర్టు కీలక సూచన

స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో జగన్ సర్కారుతో ముఖాముఖీ తలపడుతున్న క్రమంలో ఎస్ఈసీకి పలు చోట్ల ఇబ్బందులు తప్పలేదు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఏపీలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్‌, మున్సిపల్ చట్టాలే. రాజ్యాంగానికి అనుగుణంగా తయారైన ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకుంటూ నిమ్మగడ్డను జగన్‌ సర్కార్‌ అడుగడుగునా ఇరుకునపెట్టింది. దీంతో ఓ దశలో హైకోర్టు కూడా ఈ లొసుగులపై అసహనం వ్యక్తం చేసింది. అటు నిమ్మగడ్డ వాదనను కాదనలేక, ఇటు వ్రభుత్వాన్ని సమర్ధించలేక మధనపడిన హైకోర్టు.. చివరికి ఈసారి ఇలా కానివ్వండి. మీ అనుభవంతో ఎన్నికల వ్యవస్ధలో మార్పులు సూచించి వెళ్లాలని హైకోర్టు నిమ్మగడ్డను కోరింది. దీంతో ఆయన ఇప్పుడు ఎన్నికల వ్యవస్ధలో సంస్కరణలు సూచిస్తూ ఓ నివేదిక తయారు చేసి గవర్నర్‌కు పంపారు.

నిమ్మగడ్డ కీలక సిఫార్సులివే

నిమ్మగడ్డ కీలక సిఫార్సులివే

ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా జరిపేందుకు నిమ్మగడ్డ ఇందులో కొన్ని కీలక సిఫార్సులు చేశారు. వీటిలో చట్టాల్లో మార్పులు, విధానపరమైన మార్పులుగా ఈ సిఫార్సుల్ని విభజించారు. ఎన్నికలకుసంబంధించిన పూర్తి ప్రక్రియను ఎన్నికల కమిషన్‌కు అప్పగించాలని, ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో చర్చించి ఈ బాధ్యతలన్నీ ఎస్ఈసీ వద్ద కేంద్రీకృతం చేయాలని నిమ్మగ్డడ సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే స్ధానిక ఎన్నికలను కూడా సకాలంలో నిర్వహించాలని సూచించారు.స్ధానిక సంస్ధల్లో రిజర్వేషన్ల ఖరారు నిర్ణయం ప్రభుత్వాల నుంచి తొలగించి కమిషన్‌కు ఇవ్వాలి. విపత్తుల సందర్భంలో ప్రభుత్వం కమిషన్‌ను సంప్రదించి ఆరు నెలల వరకూ ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించవచ్చు. ఎన్నికల ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ, వార్డుల విభజన ప్రక్రియలు కూడా అధికారుల నుంచి తొలగించి కమిషన్‌కే ఇవ్వాలి. ఓ క్యాలెండర్‌ సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితా ఆధారంగానే రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. సంప్రదింపుల ద్వారా వార్డుల పునర్విభజన చేసే అధికారం కమిషన్‌కే ఉండాలి. ప్రస్తుతం మ్యాన్యువల్‌గా జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియ లోపభూయిష్టంగా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పట్టణ స్ధానిక సంస్ధల్లో గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ పూర్తి చేయాలి.

ఎన్నికల కమిషన్ స్వతంత్రత, అధికారాలు

ఎన్నికల కమిషన్ స్వతంత్రత, అధికారాలు


రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్ధికంగా, స్వతంత్రంగా పనిచేసే అధికారాలు ఉండాలని నిమ్మగడ్డ తన నివేదికలో సూచించారు. ఈ మేరకు కమిషన్‌ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాలన్నారు.. స్వేచ్ఛాయుతంగా, సకాలంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం నిధులు, ఉద్యోగుల కేటాయింపుతో సహకారం అందించాలన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలాగైతే కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీగా ఉంటుందో అలాగే స్ధానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జవాబుదారీగా ఉండాలని కోరారు..

 ఎస్‌ఈసీ నియామకానికి కొలీజియం తరహా వ్యవస్ధ

ఎస్‌ఈసీ నియామకానికి కొలీజియం తరహా వ్యవస్ధ

హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నిర్ణయించే అధికారం గవర్నర్‌కే ఉండాని నిమ్మగడ్డ సూచించారు.
ఎన్నికల కమిషనర్‌ ఎంపిక కోసం సుప్రీంకోర్టు కొలీజియం తరహాలో హైకోర్టు న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్‌ ఎస్ఈసీ ఒకరు సభ్యులుగా ఉండేలా వ్యవస్ధ ఉండాలి. వీరు ప్యానెల్‌ను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపితే ఆయన ఆమోదించాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్డితో సమానమైన అధికారాలు కలిగిన ఎన్నికల కమిషనర్‌కు సర్వీస్‌ రూల్స్‌ కూడా అలాగే ఉండేలా చూడాలి. కమిషన్‌ను దుర్మార్గుల నుండి రక్షించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో విమర్శలు, ఇతర దాడుల నుంచి కమిషన్‌ను రక్షణ కల్పించాలని కోరారు.

 సీఈసీ తరహాలో ఎస్ఈసీ అధికారాలు

సీఈసీ తరహాలో ఎస్ఈసీ అధికారాలు

కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో ఎన్నికలకు ముందు చాలా కాలంగా అదే పదవిలో ఉన్న అధికారుల్ని బదిలీ చేసే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాలని నిమ్మగడ్డ సూచించారు. ఎన్నికల సందర్భంగా వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర, జిల్లా స్ధాయిలో ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ ఉండాలన్నారు.. దీనిపై ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణ ఉండాలని కోరారు.. తాజాగా జరిగిన పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ ప్రయోగాత్మకంగా దీన్ని పరీక్షించింది. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల హక్కుల్ని రక్షించేందుకు కమిషన్‌కు పూర్తి స్ధాయి అధికారం ఇవ్వాలని సూచించారు. ఎన్నికలకు 15 రోజుల ముందు షెడ్యూల్‌ విడుదల చేయడంలో పారదర్శకత లేకుండా పోతోంది. దీన్ని గతంలోలా 21 రోజులకు పెంచాలన్నారు.. ఎక్స్‌ అఫీషియో ఓట్ల కోసం ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ప్రజాప్రతినిధులు ఎన్నికల కమిషన్‌కు ఆప్షన్ ఇచ్చేలా చూడాలి. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో ప్రలోభాల నిరోధానికి ఎన్నికల ఫలితాల తర్వాత మూడు రోజులకు నిర్వహిస్తున్న ఈ ఎన్నికలను ఫలితాల తర్వాత రోజే నిర్వహించేలా చూడాలి. అక్రమాల నిరోదానికి మహారాష్ట్ర తరహాలో స్ధానిక ఎన్నికల్లో ఈః-పైలింగ్‌ ద్వారా నామినేషన్లు వేసేందుకు వీలు కల్పించాని సూచించారు.

ఈవీఎంలతో మున్సిపల్‌ ఎన్నికలు

ఈవీఎంలతో మున్సిపల్‌ ఎన్నికలు

మున్సిపల్‌ ఎన్నికలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చూస్తే బ్యాలెట్‌ పేపర్లకు బదులుగా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ సూచించారు. పంచాయతీ ఎన్నికలకు మాత్రం ప్రస్తుతానికి బ్యాలెట్‌ పేపర్ల వ్యవస్ధే కొనసాగించాలన్నారు. ఎన్నికల నామినేషన్లు వేయడం, ఉపసంహరించుకునే ప్రక్రియల్ని పూర్తిగా మార్చాలి. వాటిని ఎలక్ట్రానిక్‌ పద్దతిలోకి మార్చాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలోకి మార్చాలని సూచించారు. కౌంటింగ్‌ జరిగే ప్రాంతంలోకి పోలీసుల్ని అనుమతించకూడదు. శాంతి భద్రతలు లోపించాయన్న ఫిర్యాదు వచ్చినప్పుడే వారు కౌంటింగ్‌ ప్రాంతాల్లోకి వెళ్లాలి. రీకౌంటింగ్‌ జరిగే సందర్భాల్లో కలెక్టర్లు, రిటర్నింగ్‌ అధికారులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగానే దాన్ని నిర్వహించేలా చూడాలి. .
ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత నాలుగు వారాల పాటు ఎన్నికల హింసపై వచ్చే ఫిర్యాదుల స్వీకరణ అధికారం కమిషన్‌కు ఇవ్వాలి
ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి అదికారులకు నిర్దేశిత గడువు విధించాలి. ఎన్నికల సందర్భంగా పక్షపాతంతో వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, చివరికి హెల్పర్లు, వాలంటీర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ సూచించారు.

English summary
andhra pradesh state election commissioner nimmagadda ramesh kumar has submitted a report to governor harichandan on eletoral reforms in the state according to high court orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X