వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిషత్‌ పోరులోనూ వైసీపీకి నిమ్మగడ్డ షాక్‌- నామినేషన్ల పునరుద్ధరణ‌- కీలక ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా పూర్తి చేయాలని భావిస్తున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చారు. పరిషత్‌ పోరులో గతంలో దాఖలైన నామినేషన్లపై విపక్షాల నుంచిఅభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి సమీక్షకు సిద్దమయ్యారు. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే గతంలో అక్రమాలు జరిగిన చోట వాటిని సరిదిద్దే లక్ష్యంతో నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వైసీపీకి కంటిమీద కునుకులేకుండా చేసేలా ఉన్నాయి.పరిషత్‌ వేగంగా ఏర్పాట్లు

పరిషత్‌ పోరుకు వేగంగా ఏర్పాట్లు

పరిషత్‌ పోరుకు వేగంగా ఏర్పాట్లు

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌, త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియన
పు ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకోసం గతంలో మొదలైన ప్రక్రియలో జరిగిన లోటుపాట్లపై సమీక్షకు సిద్దమయ్యారు.
ఇది పూర్తి కాగానే పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ
నెల 20 తర్వాత పరిషత్‌ ఎన్నికల రీ షెడ్యూల్‌ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

ఆగిన చోట నుంచే మళ్లీ

ఆగిన చోట నుంచే మళ్లీ

ఇప్పటికే ఇచ్చిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా ఆగిన చోట నుంచే
మొదలుపెట్టాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ నిర్ణయించారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో అనుభవాలతో పాటు న్యాయ సలహా కూడా తీసుకున్న
నిమ్మగడ్డ ఆ దిశగానే అడుగులేస్తున్నారు. అదే జరిగితే గతంలో నామినేషన్ల దశలోనే అగిపోయిన పరిషత్ ఎన్నికల పోరు తిరిగి అక్కడి
నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 20 తర్వాత ఇచ్చే షెడ్యూల్‌లో ఆ మేరకు ప్రకటన రానుంది.

 బలవంతపు ఉపసంహరణలు చెల్లవు

బలవంతపు ఉపసంహరణలు చెల్లవు

మున్సిపల్‌ ఎన్నికల తరహాలోనే పరిషత్‌ పోరులోనూ బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ చెల్లదని ఎస్ఈసీ నిమ్మగడ్డ తేల్చేశారు.
దీంతో ఆ మేరకు అప్పట్లో ప్రత్యర్ధుల ఒత్తిడి మేరకు బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించుకున్న అభ్యర్ధులకు మరో అవకాశం
ఇవ్వాలని నిర్ణయించారు. వీరంతా సరైన ఆధారాలతో కలెక్టర్లు, స్ధానిక ఎన్నికల అధికారులను ఆశ్రయించి బలవంతపు ఉపసంహరణలపై
ఫిర్యాదులు చేసేందుకు వీలు కల్పించారు. ఇలాంటి ఫిర్యాదులు తీసుకుని వాటి నివేదిక ఇవ్వాలని అధికారులను ఎస్‌ఈసీ ఆదేశాలు
ఇచ్చారు.

బలవంతపు ఉపసంహరణలపై రెండు రోజుల్లో కలెక్టర్ల నివేదిక

బలవంతపు ఉపసంహరణలపై రెండు రోజుల్లో కలెక్టర్ల నివేదిక


రాష్ట్రంలో గతేడాది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై కలెక్టర్లు,
ఎన్నికల అధికారులు తమకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకునేందుకు ఎస్ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు
అభ్యర్ధుల నుంచి వెంటనే ఫిర్యాదులు స్వీకరించాలని ఆదేశాలు ఇచ్చారు. వీటితో పాటు పోలీసుల ఫిర్యాదులు, మీడియాలో వార్తలను
కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఇలా స్వీకరించిన ఫిర్యాదులపై విచారణ జరిపి రెండు రోజుల్లో తనకు నివేదిక పంపాలని
కలెక్టర్లు, ఎన్నికల అధికారులను నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ నివేదిక అందిన తర్వాత ఎన్నికల రీ షెడ్యూల్ ప్రకటిస్తారు.

English summary
andhra pradesh state election commissioner nimmagadda ramesh kumar issued orders to revive unusual withdrawal of nominations in mptc and zptc polls last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X