కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నిమ్మగడ్డకు కంటి ఇన్‌ఫెక్షన్‌- కడప టూర్‌ వాయిదా- ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలో పరీక్షలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఓవైపు పంచాయతీ ఎన్నికల పోరు, మరోవైపు ప్రభుత్వంతో ముఖాముఖీ పోరు సాగిస్తున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ స్వల్ప అస్వస్ధతతకు గురయ్యారు. నిర్విరామంగా జిల్లాల పర్యటనలు, సమీక్షల్లో పాల్గొంటున్న నిమ్మగడ్డకు కంటి ఇన్‌ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన ఇవాళ పరీక్షలు చేయించుకోనున్నారు.

Recommended Video

Andhra Pradesh : SEC Nimmagadda Ramesh Planning To Conduct MPTC ZPTC Elections

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు సరిగ్గా ఒక్క రోజు ముందు ఎన్నిక కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు కంటి ఇన్‌ఫెక్షన్ సోకింది. రెండు రోజులుగా కంటి సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయన ఇవాళ వెళ్లాల్సిన కడప జిల్లా పర్యటనను కూడా వాయిదా వేసుకన్నారు. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉండటంతో ఇవాళ విజయవాడలోని ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రిలో ఆయన పరీక్షలు చేయిచుకుంటున్నారు. దీంతో నిమ్మగడ్డ కంటి ఇన్‌ఫెక్షన్‌ చర్చనీయాంశమైంది.

ap sec nimmagadda ramesh suffers with eye infection, postpones kadapa tour

రేపు పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో జరగబోతోంది. ఈ సమయంలో ఏర్పాట్లను సమీక్షిస్తున్న నిమ్మగడ్డ క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ప్రతిఘటనపై కోర్టుల్లో సైతం పోరాటం చేస్తున్నారు. దీంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి కూడా గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా లెక్కచేయకుండా పోరాటం చేస్తున్న నిమ్మగడ్డ రమేష్.. అధికారుల నుంచి మాత్రం సహకారం లభిస్తుందని తాజాగా వెల్లడించారు. షెడ్యూల్‌ ప్రకారం ఇవాళ కడప జిల్లాల్లో ఆయన పర్యటించాల్సి ఉంది. కంటి ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ టూర్‌ రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

English summary
andhra pradesh election commissioner nimmagadda ramesh kumar has been suffering with eye infection and undergone tests today. due to this he postpones today's kadapa district tour day before first phase panchayat elections polling.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X