వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ దూకుడుకు సిసలైన కౌంటర్‌- నిమ్మగడ్డ మైండ్‌గేమ్‌- ఆ బెదిరింపుల వెనుక ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా సాగుతున్న జగన్‌ సర్కార్‌ వర్సెస్‌ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ఆధిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. నిమ్మగడ్డను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడలకు ఆయన కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. దీంతో అసలు పంచాయతీ ఎన్నికలకు మించి వీరిద్దరి మధ్య పోరే ఆసక్తికరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్‌ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు నిమ్మగడ్డ తాజాగా మరో అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇది అనూహ్యంగా వైసీపీ శిబిరంలో కలకలం పుట్టిస్తోంది.

రేషన్‌ వాహనాలపై ఇవాళ నిమ్మగడ్డ కీలక నిర్ణయం- ఎస్ఈసీ కార్యాలయంలో తనిఖీ తర్వాతరేషన్‌ వాహనాలపై ఇవాళ నిమ్మగడ్డ కీలక నిర్ణయం- ఎస్ఈసీ కార్యాలయంలో తనిఖీ తర్వాత

 జగన్ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరులో రోజుకో ట్విస్ట్‌

జగన్ వర్సెస్‌ నిమ్మగడ్డ పోరులో రోజుకో ట్విస్ట్‌

ఏపీలో పేరుకు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నా వీటి తెర వెనుక అంతకు మించిన అసలు సిసలైన పోరును జగన్ సర్కార్, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన జగన్ సర్కార్‌.. ఇప్పుడు ఎన్నికల్లో నిమ్మగడ్డ ఆధిపత్యం సాగకుండా అడుగడుగునా అడ్డుకుటోంది. ఆయన కూడా అంతే దీటుగా స్పందిస్తుండటంతో సర్కారు పలుమార్లు డిఫెన్స్‌లో పడాల్సిన పరిస్ధితి కనిపిస్తోంది. ముఖ్యంగా నిమ్మగడ్డను లక్ష్యంగా చేసుకుని సర్కారు ప్రయోగిస్తున్న అస్త్రాలకు ఆయన మైండ్‌గేమ్‌తో చెబుతున్న సమాధానాలు కొత్త ట్విస్ట్‌లకు కారణమవుతున్నాయి.

జగన్ దూకుడుకు మైండ్‌గేమ్‌తో కౌంటర్‌

జగన్ దూకుడుకు మైండ్‌గేమ్‌తో కౌంటర్‌

వైసీపీ సర్కారుకు ఈ పంచాయతీ ఎన్నికలు ఇష్టం లేదని అందరికీ తెలుసు. ఈ పోరులో ఎస్‌ఈసీ నిమ్మగడ్డను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని కూడా తెలుసు. కానీ తెరవెనుక సాగుతున్న మైండ్‌గేమ్‌ మాత్రం చాలా సార్లు ప్రత్యర్ధులకు కూడా అంతుబట్టడం లేదు. నిమ్మగడ్డను విజయవాడకు పరిమితం చేయాలని భావించిన సర్కారుకు కౌంటర్‌గా జిల్లా టూర్‌ను ప్రారంభించిన నిమ్మగడ్డ కొత్త వార్‌కు తెరలేపినట్లయింది. ఇందులో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జగన్‌ సర్కార్‌పై మైండ్‌గేమ్‌ ఆడుతున్నట్లే అనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీకి ఆయువు పట్టుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడంతో పాటు అక్కడికి వెళ్లి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు నిమ్మగడ్డ మైండ్‌గేమ్‌ను స్పష్టం చేస్తున్నాయి.

వైఎస్‌ సెంటిమెంట్‌ వాడేసుకున్న నిమ్మగడ్డ

వైఎస్‌ సెంటిమెంట్‌ వాడేసుకున్న నిమ్మగడ్డ

నిమ్మగడ్డ కడప బయలుదేరడానికి ముందు ఆయన అక్కడికి వెళ్లి మాజీ సీఎం వైఎస్‌ గురించి ప్రస్తావిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ అక్కడికి వెళ్లి ఒంటిమిట్ట ఆలయం దర్శనం చేసుకున్నాక మాట్లాడిన నిమ్మగడ్డ వైఎస్ మంచోడు, జగన్‌లా కాదన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరంలో కలకలం రేపాయి. అలాగే తనకు వైఎస్‌ ఆశీస్సులు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలూ ఇదే కోవలోకి వస్తాయి. తద్వారా కడపలో వైఎస్ కుటుంబం గురించి మాట్లాడి వైసీపీని ఇరుకునపెట్టిన పరిస్దితి. దీనిపై ఎలా స్పందించాలో తెలియక ఇబ్బంది పడ్డ వైసీపీ రెండు రోజుల తర్వాత చిత్తూరు వెళ్లి చంద్రబాబు గురించి కూడా చెబుతారా అని ఆయన్ను ప్రశ్నించింది.

జగన్ కేసుల్లో సాక్షినవుతానంటూ

జగన్ కేసుల్లో సాక్షినవుతానంటూ


కడప జిల్లా పర్యటనలోనే నిమ్మగడ్డ రమేష్ మరో మైండ్‌గేమ్‌కు తెరలేపారు. గతంలో కొన్ని కేసుల్లో తాను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. అవసరమైతే వాటిపై వాంగ్మూలం కూడా ఇస్తానంటూ జగన్‌ కేసులను ప్రస్తావిస్తూ నిమ్మగడ్డ మరో భారీ సవాల్ విసిరారు. దీంతో వైసీపీ శిబిరం పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ పాత కేసుల్లో కాస్త ఊరట దక్కుతుందని భావిస్తున్న తరుణంలో అప్పటి ఫైనాన్స్‌ సెక్రటరీ హోదాలో సాక్ష్యం ఇస్తానంటూ నిమ్మగడ్డ ముందుకు వస్తే పరిస్ధితి ఎలా మారుతుందన్న ఆందోళన వైసీపీ వర్గాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాతే దీనికి కౌంటర్‌గా ఆయన్ను మహారాష్ట్ర ఎస్ఈసీ తరహాలో జైలుకు పంపేందుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అంశాన్ని వైసీపీ తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎంత పెద్దోళ్లయినా శిక్ష తప్పదంటూ

ఎంత పెద్దోళ్లయినా శిక్ష తప్పదంటూ

తాజాగా తూర్పుగోదావరి జిల్లా గొల్లలగుంటలో అనుమానాస్పదంగా మృతిచెందిన టీడీపీ సర్పంచ్ అభ్యర్ధి భర్త శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని రాజకీయ నేతల తరహాలో పరామర్శించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ అక్కడ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉన్నాయి. ప్రతీ విషయాన్నీ రాజకీయం చేయడం తగదని, తప్పు చేస్తే ఎంత పెద్దోళ్లయినా శిక్ష పడక తప్పదంటూ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే అయి ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇలా జిల్లాల పర్యటనలో నిమ్మగడ్డ తన సంచలన వ్యాఖ్యలతో జగన్ సర్కారుపై మైండ్‌గేమ్‌ సాగిస్తున్నట్లు అర్ధమవుతోంది.

Recommended Video

#APpanchayatelections: కడపలో వైఎస్సార్ గురించి చెప్పి , చిత్తూరులో చంద్రబాబు విషయం చెప్పలేదే..!1

English summary
andhra pradesh state election commissioner nimmagadda ramesh kumar seems to be depends on mind game in panchayat election war against ys jagan led ysrcp govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X