వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్ మిలీనియం టవర్స్‌లో సచివాలయం, ప్రాధాన్యత క్రమంలో శాఖల తరలింపు, క్యాబినెట్ నిర్ణయం..?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ఉన్న విభాగాలను విశాఖపట్టణం తరలించనుంది. వైజాగ్‌లోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయం కొలువుదీరబోతున్నది. సచివాలయ తరలింపునుకు సంబంధించి మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకొంటామని, ప్రభుత్వ వర్గాలు ఇండికేషన్స్ ఇచ్చాయి.

క్యాబినెట్ భేటీ

క్యాబినెట్ భేటీ

ఈ నెల 8వ తేదీ రెండో బుధవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. భేటీలో సచివాలయ తరలింపునకు సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. క్యాబినెట్ నిర్ణయం తర్వాత 20వ తేదీ నుంచి విశాఖపట్టణంలోని మిలీనియం టవర్స్‌లో కొత్త సచివాలయంలో విధులు నిర్వర్తిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. విడతలవారీగా సచివాలయ విభాగాల తరలింపు ప్రక్రియను చేపడుతారు.

శాఖలివే..?

శాఖలివే..?

ప్రాధాన్యత శాఖల్లో కీలక విభాగాలకు ఆన్ డ్యూటీ కింద తరలిస్తారు. జీఏడీ నుంచి మూడు సెక్షన్లు, ఆర్థికశాఖ నుంచి రెండు సెక్షన్లు, మైనింగ్ నుంచి రెండు, హోంశాఖ నుంచి నాలుగు సెక్షన్లు, రోడ్లు భవనాల నుంచి నాలుగు సెక్షన్లు, పంచాయతీరాజ్ నుంచి నాలుగు, వైద్యారోగ్యశాఖ, ఉన్నత విద్య, పాఠశాల విద్యాశాఖ నుంచి రెండేసి సెక్షన్లను తరలిస్తారు.

34 శాఖలు

34 శాఖలు

34 శాఖల నుంచి కీలక విభాగాలను క్రమంగా విశాఖపట్టణానికి తరలిస్తారు. శాఖల తరలింపుతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు న్యాయపరంగా చిక్కులు రాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. గణతంత్ర దినోత్సవాలను కూడా విశాఖపట్టణంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది. సచివాలయం తరలింపునకు సంబంధించి ఈ నెల 20 లేదా 21న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి.. ఆమోదం తెలిపే అవకాశాలు కూడా ఉన్నాయి.

English summary
ap secretariat will move to vizag millennium towers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X