వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదిగోండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని, అందుకు ఆధారాలున్నాయని ఏపీ మంత్రులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు.

మంత్రులు పత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్, అచ్చెన్నాయుడు తదితరులు రాష్ట్రపతిని కలిశారు. టీడీపీకి చెందిన గరికపాటి మోహన్ రావు ఫోను ట్యాపింగ్‌కు గురైన ఆధారాలను రాష్ట్రపతికి సమర్పించారు.

మంత్రులు, ఐఏఎస్ అధికారులు, ప్రధాన వ్యక్తు ల పోన్లనూ ట్యాప్ చేశారని ఆఱోపించారు. దీంతో పాటు సెక్షన్ 8 అమలు అంశాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8ను కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు భద్రత కరువైందని ఏపీ సర్కారు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు మంగళవారం వేర్వేరుగా రాష్ట్రపతిని కలిశారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు


తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై తమ నిరసన వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 8 అమలు చేయాలని కోరారు. హైదరాబాద్‌ శివారు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో వారు కలిశారు. సెక్షన్‌ 8తోపాటు ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు.

 రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. ఉమ్మడి రాజధాని, ఉమ్మడి గవర్నర్‌ అనేది గతంలో ఎక్కడా లేదని, అయితే ఏపీ రాష్ట్ర విభజనతో దేనినీ పోల్చలేం. అందుకే గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పించారని, కానీ, సెక్షన్‌ 8 ఉమ్మడి రాజధానిలో అమలు కావడం లేదని, అందువల్ల ఇక్కడ ఉంటున్న ఏపీ ప్రజలకు రక్షణ, భద్రత కరువయ్యాయని తెలిపారు.

 రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు

ప్రజలను సెటిలర్లు, ఆంధ్రోళ్లు అంటూ అవమానిస్తున్నారన్నారు. ఐఏఎస్‌ అధికారులను సైతం పలు రకాలుగా అవమానించారని వివరించారు. ఉమ్మడి సంస్థల్లో ఏపీకి చెందిన నిధులను విడుదల చేయకుండా బ్యాంకులను హెచ్చరించారని ఇవన్నీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేదని రాష్ట్రపతికి తెలిపారు.

రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు

ఉద్యోగుల పంపిణీ జరగక ముందే ఏపీ ఉద్యోగులను బలవంతంగా పంపించి వేస్తున్నారని వివరించారు. ఏపీ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్న కార్యాలయాలకు బలవంతంగా తాళాలు వేసి వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.

 రాష్ట్రపతికి ఫిర్యాదు

రాష్ట్రపతికి ఫిర్యాదు

రాజ్యాంగలోని ఆర్టికల్‌ 21ని ఉల్లంఘిస్తూ ఏపీ సీఎం, మంత్రులు, కీలక అధికారులతో సహా మొత్తం 120 మంది వ్యక్తుల ఫోన్లను తెలంగాణలో ట్యాప్‌ చేశారని మంత్రులు రాష్ట్రపతికి తెలిపారు.

English summary
AP shows president proof of TS phone tapping
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X