వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సచివాలయం 2వబ్లాక్ వద్ద మోగిన అలారం: ఉద్యోగుల పరుగు, పోలీసులపై స్పీకర్ ఆగ్రహం

ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారమ్ మోగింది. దీంతో లోపల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.

By Oneindia Staff Writer
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సచివాలయం రెండో బ్లాక్ లో అకస్మాత్తుగా ఎమర్జెన్సీ అలారమ్ మోగింది. దీంతో లోపల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు.

కనీసం అరగంట పైగా ఏమి జరిగింది అనేది అంతుబట్టలేదు. మరో ప్రక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటం తో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీ ని పోలీసులు పరిసిలిస్తున్నారు. చివరికి ఎవరో పొగ త్రాగడం వల్ల అలారమ్ మోగింది తేల్చిన పోలీసులు. దీనితో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.

AP speaker fires at police

పోలీసులపై స్పీకర్ సీరియస్

అమరావతి: సెక్కూరిటీ పేరుతో ఓవర్ యాక్షన్ చేసిన గుంటూరు పోలీసులకు శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్లాస్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీకి వెళుతున్న మంత్రి కామినేని, ప్రభుత్వం విప్, నలుగురు ఎమ్మెల్యేల కార్లను పోలీసులు అడ్డుకున్నారు.

అసెంబ్లీకి వెళ్లే దారి లేదంటూ మరో దారిలో వెళ్లాలని సూచించారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్‌మెన్‌లతో వాగ్వాదానికి దిగారు. దీంతో 15 నిముషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రోడ్డుపైనే ఉండిపోయారు.

ఆ తర్వాత మరో మార్గంలో అసెంబ్లీకి చేరుకుని స్పీకర్‌కు పిర్యాదు చేశారు. దీంతో సభాపతి రూరల్ ఎస్పీ వెంకటప్పల నాయుడిని అసెంబ్లీకి పిలిపించి క్లాస్ తీసుకున్నారు. మరోసారి ప్రజా ప్రతినిధులను అడ్డుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

English summary
Andhra Pradesh speaker Kodela siva prasad fired at police staff for stopping ministers and MLAs vehicles.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X