• search
  • Live TV
శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆ ఛాన్స్ ఇవ్వొద్దు: టీడీపీ నేతలపై స్పీకర్ సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం, కలివరం గ్రామాల్లో పర్యటించారు తమ్మినేని సీతారాం. ఈ సందర్భంగా ఆయన ధరల పెరుగుదలపై టీడీపీ చేస్తున్న నిరసనలపై ఘాటు విమర్శలు చేశారు.

గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగితే కేంద్రాన్ని అడగండి.. ఇంట్లో జోడీగానే ఉన్నారుగా? అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని వదిలేసి... తమపై ఏడుస్తారెందుకు? అని దుయ్యబట్టారు. 1,261 హామీలిచ్చి నెరవేర్చని మీదా దేవతల పాలన ? అని ప్రశ్నించారు సీతారం ఏచూరి. మోసం, దగా, వంచనతో నయవంచక పాలకులుగా మీరు మిగిలిపోయారన్నారు. జనం బుర్రగొరిగి ఇంటికి పంపించినా మీకు సిగ్గురాలేదు అంటూ ధ్వజమెత్తారు.

AP Speaker Tammineni Sitaram slams tdp leaders.

సంక్షేమంపై క్యాలండర్ ప్రకటించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని స్పీకర్ సీతారాం ఏచూరి ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించిన ఆయన.. మనం సైలెంట్ గా ఉన్నాం కాబట్టే టీడీపీ విమర్శలు చేస్తోందన్నారు. ఇకపై మౌనం వీడాలి... మనల్ని విమర్శించే వారిపై కచ్చితంగా తిరగబడాలని పిలుపునిచ్చారు.

సీఎం జగన్‌కు కనీసమద్దతు ఇవ్వకపోతే టీడీపీ ఇంకా రెచ్చిపోతుందన్నా సీతారాం ఏచూరి. ముఖ్యమంత్రికి మద్దతు ఇవ్వకపోతే పార్టీ శ్రేణులం బలహీనులం అయిపోతాం అన్నారు. ఇక, ఈ సందర్భంగా టీడీపీ నేతలకు సవాల్ విసిరిన ఆయన.. ఏ వేదికపై చర్చించడానికి వస్తారో రమ్మనండి .. వైసీపీలో సామాన్యకార్యకర్తను పంపిస్తా... మాతో చర్చకు వస్తారా? అంటూ సవాల్ చేశారు తమ్మినేని సీతారాం.

మరోవైపు మంత్రి కన్నబాబు.. లోకేశ్‌, చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తనయుడు లోకేశ్‌ ఎలా అల్లరి చేయాలో తండ్రి చంద్రబాబు నాయుడు శిక్షణ ఇస్తున్నట్లుందని మంత్రి ఎద్దేవా చేశారు. ఏడు నెలల కిందట జరిగిన సంఘటనలో ప్రభుత్వం ఎలా వ్యవహరించిదో అందరికీ తెలుసన్నారు. వాళ్లకి ప్రజలపై ప్రేమ లేదు.. తండ్రి స్క్రీన్ ప్లేలో లోకేశ్‌ నటిస్తున్నాడని కన్నబాబు విమర్శించారు. మహిళల భద్రతలో ఎవరితోనో చెప్పించుకోవాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీడీపీలో కూడా లోకేశ్‌ నాయకత్వాన్ని అంగీకరించడం లేదని చెప్పారు. అందుకే ఇలాంటి డ్రామాలు అని పేర్కొన్నారు. జేసీ దివాకర్ రెడ్డి బస్సు ప్రమాదం జరిగితే తమ నాయకుడు వెళితే కేసులు పెట్టింది ఏ ప్రభుత్వం..? రన్ వేపై నిలిపివేసి దుర్మార్గంగా వ్యవహరించింది ఎవరు..? ఏం తప్పు చేశారని ఆ రోజు కాపులు కంచాలు కొట్టారని వేల మందిపై కేసులు పెట్టారు..? అని నిలదీశారు.

రమ్య కుటుంబానికి ఏపీ సర్కారు సాయం

హత్యకు గురైన రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల నివాస స్థలానికి సంబంధించిన పట్టాను శనివారం సుచరిత అందజేశారు. హోంమంత్రి వెంట ఎమ్మెల్యేలు మేరుగు నాగార్జున, ముస్తఫా, మద్దాలి గిరిధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌ ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. రమ్య కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని, రమ్య సోదరి మౌనికకు డిగ్రీ పూర్తయ్యేంత వరకు ఆగకుండా వెంటనే ఉద్యోగం కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అందరూ దిశ యాప్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. పాలడుగు ఘటనలో పోలీసు విచారణ జరుగుతుందని నిందితులను పట్టుకోగానే మీడియా ముందు పోలీసులు ప్రవేశపెడతారన్నారు. విచారణ దశలో పూర్తి వివరాలను వెల్లడిస్తే నిందితులు తప్పించుకునే అవకాశం ఉందని, ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతోందని మంత్రి సుచరిత వెల్లడించారు.

English summary
AP Speaker Tammineni Sitaram slams tdp leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X