అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలను కలవనున్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై అటు పార్లమెంట్‌లో, ఇటు రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిన తరుణంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత లభించింది. కాగా, ప్రభుత్వం ఘనంగా నిర్వహించ తలపెట్టిన కృష్ణా పుష్కరాల్లో పాల్గొనేందుకు రావాలని వారిని ఆహ్వానించేందుకు వెళ్తున్నారని సీఎంఓ వర్గాలు పేర్కొన్నాయి.

 ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

కానీ పార్టీ నేతలు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని అంటున్నారు. అయితే ప్రధాని మోడీని గురువారం కలుస్తారా లేక శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అవుతారా అన్న దానిపై సీఎంఓ స్పష్టత ఇవ్వలేదు.

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

అయితే ప్రధానితో భేటీ ఎప్పుడు జరిగినా ప్రత్యేకహోదా అంశంపై మోడీని చంద్రబాబు గట్టిగా ప్రశ్నిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే జీఎస్టీ బిల్లుపై మద్దతు కోసం అరుణ్ జైట్లీ ఫోన్ చేయగా, రాష్ట్రానికి హోదాపై ఫోన్ చేశారంటూ పార్టీ నేతలు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే.

 ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

మరోవైపు ఏపీకి ప్రత్యేకహోదాపై అరుణ్ జైట్లీ ఒక ఫార్ములాను సిద్ధం చేశారని, దానిపై చర్చిండానికే చంద్రబాబును మోడీ ఢిల్లీకి పిలిపిస్తున్నారన్న మరో వాదనా తెరపైకి వచ్చింది. హోదాకోసమైతే రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా ఫోన్ చేయాలి కానీ, చర్చ ముగిసిన తర్వాత ఫోన్ చేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు.

 ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

ఢిల్లీకి చంద్రబాబు: పుష్కరాల పిలుపుకా లేక ప్రత్యేకహోదా సాధనకా?

షెడ్యూల్ ప్రకారం రాజ్ నాథ్ సింగ్ ను కలవాల్సి ఉన్నప్పటికీ ఆయన సార్క్ సమావేశాల కోసం పాకిస్థాన్ వెళ్లినందున ఆయనను కలవలేకపోతున్నారు.

English summary
Amidst the protest over denial of special category status to Andhra Pradesh, Chief Minister N Chandrababu Naidu will be visiting New Delhi on August 4 to formally invite the top political dignitaries for Krishna Pushkaralu festival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X