ఆట మొదలైంది- తెర పైకి ప్రత్యేక హోదా : జగన్ కొత్త రాజకీయం- ఆ పార్టీలను పక్కాగా ఫిక్స్ చేస్తూ..!!
ఏపీలో రాజకీయ సమీరణాలు వేగంగా మారిపోతున్నాయి. రెండున్నారేళ్ల పాలన పూర్తి చేసిన సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణ పైన తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. ఎమ్మెల్సీల సీట్ల భర్తీకి రంగం సిద్దమైంది. పెడింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలు పూర్తి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల గురించి కేబినెట్ విస్తరణలో ప్రస్తావించారు. సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు.. కొత్త వారికి మంత్రి పదవులు ఇవ్వటంతో పాటుగా తాను ఇక ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ టీం సైతం పార్టీ కోసం వస్తోందని సీఎం స్వయంగా వెల్లడించారు.

ప్రతిపక్షాలను ఫిక్స్ చేసేలా
ఇక, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలను ఫిక్స్ చేస్తూ రాజకీయ అడుగులు వేస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో కీలకంగా మారిన ప్రత్యేక హోదా పైన జగన్ నాడు టీడీపీని ఇరకాటంలోకి నెట్టేసారు. యువభేరీలు నిర్వహించి ప్రత్యేక హోదా కోసం ఊరూరా తిరిగారు. ఇక, 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు.. 151 మంది ఎమ్మెల్యేలతో అధికారంలోకి వచ్చారు. అయినా..కేంద్రంలో బీజేపీకి ఎవరి మద్దతు అవసరం లేకుండా రెండో సారి అధికారంలోకి రాగలిగారు. దీంతో..తాము డిమాండ్ చేసే పరిస్థితి లేకుండా పోయిందని జగన్ చెప్పుకొచ్చారు. అయినా..తాము ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటామని స్పష్టం చేసారు.

2024 ఎన్నికల వ్యూహంలో భాగంగా
ఇక,
టీడీపీ
ఎలాగైనా
బీజేపీకి
దగ్గర
కావాలనే
ఉద్దేశం..జనసేన
ఇప్పటికే
బీజేపీతో
పొత్తు
పెట్టుకోవటంతో
ప్రత్యేక
హోదా
విషయంలో
అటు
కేంద్రాన్ని...ఇటు
జగన్
ను
నిలదీయ
లేకపోతున్నారు.
ఆ
సమీకరణాలే
ప్రత్యేక
హోదా
అంశంలో
జగన్
ఇరకాటంలో
పడకుండా
అడ్డుకున్నాయి.
అయితే,
ఇప్పుడు
జగన్
తానే
తిరిగి
ప్రత్యేక
హోదా
అంశాన్ని
తెర
మీదకు
తీసుకొస్తున్నారు.
ఇది
పక్కా
రాజకీయ
వ్యూహంలో
భాగంగా
వేస్తున్న
అడుగుగా
కనిపిస్తోంది.
కేంద్రంతో
జగన్
సత్సంబంధాలు
కొనసాగిస్తున్నా..తాము
కోరుకుంటున్న
పాలనా
పరమైన
-
రాజకీయ
అంశాల్లో
మాత్రం
వారి
నుంచి
సరైన
స్పందన
రావటం
లేదు.
వీటన్నింటి
కంటే
ముఖ్యంగా
రాష్ట్రంలో
తిరిగి
అధికారం
దక్కించుకోవటం
జగన్
కు
అతి
ముఖ్యమైనది.

అమిత్ షా పర్యటనతో ఆరంభం
దీంతో... ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలన్నీ చర్చకు వచ్చేలా చూడాలన్నారు.

కేంద్రం పైన మరోసారి ఒత్తిడి పెంచుతూ
ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో ఏపీతో ముడిపడినవి ఏమైనా ఉంటే వాటిపై తగిన రీతిలో చర్చించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. దీని ద్వారా ఎలాగో బీజేపీ హోదా పైన సానుకూలగా స్పందించే అవకాశం ఉండదనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీతో జత కట్టిన జనసేన..వారిద్దరితో కలవాలని ప్రయత్నిస్తున్న టీడీపీ ఆత్మరక్షణలో పడటం ఖాయమని భావిస్తున్నారు. దీని ద్వారా ఆ రెండు పార్టీలతో బీజేపీ తో కలిసి కొనసాగే పరిస్థితులకు బ్రేకులు వేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

టీడీపీ - జనసేన కు ఛాన్స్ ఇవ్వకుండా
అదే సమయంలో తాము పోరాటం చేస్తున్నామని..తమతో కలిసి రావాలని పిలుపునివ్వటం ద్వారా ప్రత్యేక హోదా అంశం లో మిగిలిన పార్టీలకు ఛాన్స్ ఇవ్వకూడదనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న జగన్...ప్రత్యేక హోదా అంశంలో సైతం తనను ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షాలకు లేకుండా చేయటమే జగన్ అసలు వ్యూహం. దీని ద్వారా ప్రతిపక్షాలకు ఏ అంశంలోనూ ఛాన్స్ ఇవ్వకుండా... ముందుకు వెళ్లేందుకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు.