'అప్పుడెక్కడికి పోయావ్ పవన్.. ట్వీట్లు ఆపెయ్, అడ్డుకుని తీరుతాం..'
సమైక్యాంధ్ర ఉద్యమం సందర్బంగా విద్యార్థులను జైల్లో పెడుతుంటే అప్పుడు పవన్ ఎక్కడికిపోయారని విద్యార్థి జేఏసీ చైర్మన్ అడారి కిషోర్ కుమార్ ప్రశ్నించారు.
విశాఖ: ప్రత్యేక హోదా ఆకాంక్షను మౌనదీక్ష ద్వారా వ్యక్తం చేయాలని భావిస్తున్న ఏపీ యువతకు ప్రభుత్వ చర్యలు అడ్డంకిగా మారాయి. సెక్షన్-144తో ఎక్కడిక్కడ నిర్బంధాలు కొనసాగుతుండటంతో యువత బీచ్ వైపు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ చర్యను సమర్థించేలా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఒక ప్రకటన చేసింది.
ఆర్కే బీచ్ లో జరిగే నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుని తీరుతామని ప్రకటించింది. అంతేకాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వెంటనే తన ట్వీట్లు ఆపేయడం మంచిదని హితవు పలికారు.

సమైక్యాంధ్ర ఉద్యమం సందర్బంగా విద్యార్థులను జైల్లో పెడుతుంటే అప్పుడు పవన్ ఎక్కడికిపోయారని విద్యార్థి జేఏసీ చైర్మన్ అడారి కిషోర్ కుమార్ ప్రశ్నించారు. 'రిపబ్లిక్ డే' నాడు జాతీయ జెండాకు వందనం చేసి దేశభక్తిని చాటుకోవాల్సిన తరుణంలో హోదా పేరిట దేశాన్ని అవమానించే కార్యక్రమాలు చేపడుతారా? అని మండిపడ్డారు.
ఉద్యమం పేరు చెప్పి రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకురావద్దని జేఏసీ విమర్శిస్తోంది. సీఐఐ సదస్సు ద్వారా వచ్చే రెండేళ్లలో రాష్ట్రానికి 2.25 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నట్టు కిషోర్ తెలిపారు. యువతను తప్పుదోవ పట్టించి వారి భవిష్యత్తును నాశనం చేయవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications