విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి:ప్రధాన పార్టీలకి సర్వేల ఫీవర్...ఫ్యూచర్ పై అభ్యర్థుల బేజారు!

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఫలానా నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరయితే బాగుంటుంది?...అక్కడి జనాలు ఎవరిని కోరుకుంటున్నారు?...నియోజకవర్గంలో వారి బలాబలాలెంత?...ఫలానా అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి?...అచ్చంగా ఇవే ప్రశ్నలు కాకపోయినా ఇలాంటి ప్రశ్నలనే అటుతిప్పి ఇటుతిప్పి అడుగుతూ నియోజకవర్గాల్లో సర్వే కొనసాగిస్తున్నారు కొందరు వ్యక్తులు.

ఆ కొందరు వ్యక్తులు ఏ ఒక్క పార్టీకో చెందిన వారు కాదు...ఒక్కో బృందం ఒక్కో పార్టీకి చెందినదై ఉండొచ్చు. కారణం ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలను సర్వేల ఫీవర్ ఆవరించింది. ఆ ఫీడ్ బ్యాకే అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేల్చనుంది. అందుకే ఎపిలోని ప్రధాన పార్టీలు బాటపట్టగా...ఆ విషయం తెలిసి అందరూ కాకపోయినా మెజారిటీ అభ్యర్థుల్లో ఆందోళన రేగుతోంది. కారణం ఈ సర్వేలు తమ కొంప ఎక్కడముంచుతాయోననే?..జనాలు తమ గురించి ఏమి చెబుతారోననే?..వివరాల్లోకి వెళితే...

టిడిపి...సర్వేలమీద సర్వేలు

టిడిపి...సర్వేలమీద సర్వేలు

ఎన్నికలు చిన్నవైనా...పెద్దవైనా...అవి ఏ తరహా ఎన్నికలైనా...టికెట్‌ ఆశిస్తున్న నాయకుల గురించి ఒకటికి పదిసార్లు చెక్ చేసిగాని అధికార పార్టీ టిడిపి అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వరని ప్రతీతి. గతంలో కంటే ఇప్పుడు సర్వేలు మరింత ఖచ్చితత్వంతో కొనసాగుతుండటం...సాంకేతికను మేళవిస్తుండటం వల్ల ఇప్పుడు సర్వేలపై చంద్రబాబు విశ్వాసం మరింత పెరిగిందట. అందువల్లే గడచిన నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌చార్జీల పనితీరుపై పలు సందర్భాల్లో అనేక నివేదికలు తెప్పించుకున్నారు. అంతేకాదు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యంపై పార్టీ పరిశీలకులు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆరు నెలలకు ఒకసారి వారికి గ్రేడింగ్‌లు సైతం ఇస్తున్నారు.

గతం గత:...తాజా సర్వేలే కీలకం

గతం గత:...తాజా సర్వేలే కీలకం

అయితే తమ పై సర్వే జరుగుతుందంటే ఎవరికైనా ఆందోళనే...స్థానికంగా నెలకొనే ఏ అంశాలు ఎటుకి దారితీస్తాయోనని వాళ్లలో గుబులు రేగడం సహజం.
గత సర్వేల్లో తమకు 10 పాయింట్లు...9 పాయింట్లు వచ్చాయని మురిసిపోయిన నాయకులు సైతం మళ్లీ జరుగుతున్న తాజా సర్వేలతో ఠారెత్తుతున్నారు. సిఎం చంద్రబాబు ఇంటెలిజెన్సీ సర్వేతో పాటు ఓ వర్సిటీలో చదివిన యువకులు, ఓ ప్రైవేటు సంస్థ ద్వారా వేర్వేరుగా సర్వే చేయించి నాయకుల పని తీరు, ప్రజల్లో వారికున్న బలాబలాలపై నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. మూడు నివేదికలను క్రోడీకరించి టికెట్‌ ఆశిస్తున్న వారి బలాబలాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడు తెలిపారు.

అభ్యర్థుల ఆందోళన..ఇదీ

అభ్యర్థుల ఆందోళన..ఇదీ

అయితే ఈ సర్వేలే ఆఖరు కాదని, ఏడాది కాలంలో జరిగే మరో రెండు, మూడు సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయని ఆ పార్టీ కీలకనేతలు చెబుతున్నారు. అయితే నాలుగేళ్లకు పైగా పార్టీని నమ్ముకుని కార్యక్రమాల పేరుతో రూ.లక్షలాది రూపాయలు మంచినీళ్లలాగా ఖర్చు పెట్టామని, ఏ చిన్న కార్యక్రమం చేయాలన్నా ఫ్లెక్సీలు మొదలుకొని భోజనాలు, టిఫిన్లు, వాహనాలు, బైకులకు డీజిల్‌, పెట్రోల్‌ ఇలా అనేక రకాలుగా కనీసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు వస్తోందని...ఇక కార్యక్రమాల నిమిత్తం మంత్రో, ముఖ్యమంత్రో వస్తే ఇక వాటికి ఖర్చు ఎంతవుతుందో చెప్పలేమని...అలాంటిది ఇంతా చేసి చివర్లో పనితీరు బాగాలేదని...సర్వేలో వ్యతిరేకంగా వచ్చిందని టికెట్‌ ఇవ్వలేమంటే తమ పరిస్థితి ఏమిటని ఓ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ఆశావాహుల్లోనూ...సర్వే భయం

వైసీపీ ఆశావాహుల్లోనూ...సర్వే భయం

మరోవైపు వైసీపీ నాయకులనూ సర్వేల భయం వెంటాడుతోంది...నియోజకవర్గంలో పార్టీ బలాబలాలు ఎలా ఉన్నాయి?...సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి జనాలు ఏమనుకుంటున్నారు?...ఇతర పియోజకవర్గాల్లో ఎవరికి టికెట్‌ ఇస్తే గెలవచ్చు?...సామాజికవర్గాల బలాబలాలు...అండదండలు ఎవరికి ఉన్నాయి?...ఇలా వివిధ కోణాల్లో వైసిపికి సంబంధించి పీకే ఇప్పటికే సమగ్ర సర్వే నివేదిక ఇచ్చినట్లు ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. అంతటితో ముగిసినట్లు కాకుండా పీకే టీమ్ మెంబర్స్ వివిధ నియోజకవర్గాల్లో మరింత కూలంకషంగా అభిప్రాయాలు సేకరిస్తున్నారట. గతంలో నివేదికల ఆధారంగానే ఇప్పటివరకు కొందరు నాయకులకు జగన్‌ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని అనుకుంటున్నారు.

 లేటెస్ట్ నివేదిక...పార్టీ మీటింగ్

లేటెస్ట్ నివేదిక...పార్టీ మీటింగ్

తాజాగా పికె బృందం కర్నూలు జిల్లాకు సంబంధించి సర్వే పూర్తిచేసి ఆ నివేదికను జగన్‌ చేతికి ఇచ్చారట. గత నెల 27న సర్వే నివేదిక ఆధారంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలోనే జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించాలని పార్టీ నేతలు సన్నాహాలు చేసినా అనివార్యకారణాల వల్ల ఆ సమావేశం జరగలేదు. అయితే అతి త్వరలోనే ఆ భేటీ ఉంటుందని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, జిల్లా ముఖ్య నాయకులకు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. కొందరు సిట్టింగ్ లకు, మరికొందరు ఆశావాహులకు పరిస్థితులు అంత సానుకూలంగా లేవని...ఏడాదిలోపు వారు పుంజుకోకుంటే వేరొకరికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుందని అనుకుంటున్నారు. సర్వే జరిగిన విషయం నిజమేనని, ఏ నియోజకవర్గంలో ఎవరి పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని జిల్లాకు చెందిన ఓ వైసీపీ నాయకుడు తెలిపారు.

బీజేపీ, జనసేన...సైతం

బీజేపీ, జనసేన...సైతం

మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీల అమల్లో కేంద్రం అన్యాయం చేసిందన్న అభిప్రాయం మెజారిటీ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో బిజెపి తాజా పరిస్థితులపై సమగ్ర సర్వే చేయించినట్లు తెలిసింది. రాష్ట్ర స్థాయిలో బిజెపి గురించి అసలు ప్రజాభిప్రాయం ఏమిటి?...జిల్లాలో బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు?...రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకుల విమర్శలపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు...తమ పార్టీ నేతలు ఎలా తిప్పికొడుతున్నారు?... కేంద్ర పథకాల అమలు గురించి ప్రజల మనోభావాలు ఎలావున్నాయి?....తదితర అంశాలపై బీజేపీ అధినేత అమిత్‌షా కూడా ఓ రహస్య సర్వే చేయించినట్లు ఆ పార్టీ ముఖ్య నేత తెలిపారు. అమిత్ షా సర్వే ఆధారంగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇక జనసేన విషయానికొస్తే కొన్ని జిల్లాల్లో అత్యంత బలంగా...మరికొన్ని జిల్లాల్లో బాగా బలహీనంగా...కొన్ని చోట్ల నామమాత్రంగా ఇలా ఉంది. ఈ క్రమంలో అన్నిచోట్లా పోటీ చేయాలనుకుంటున్న జనసేన వీలైనంత బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు సర్వేనే నమ్ముకుందట. ఇదీ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు సర్వేలకు ఇస్తున్న ప్రాధాన్యత.

English summary
Vijayawada:All the main political parties in Andhra Pradesh are engaged in surveys fever. These survey reports will be decide the fate of the candidates while the elections are coming up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X