రక్త పిశాచాలుగా వైసీపీ నేతలు.. జగన్ పుట్టిన రోజు వేడుకలపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అద్యక్షుడ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసేశారు. జగన్ తన పుట్టిన రోజున పేదల రక్తాన్ని పీల్చే పథకాన్ని ప్రారంభించారని మండిపడ్డారు. ఆయన నోటి వెంట అమ్మడం అనే పదం తప్ప మరో మాట రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్తులు అమ్మడం తప్ప మరొకటి చేతకావడంలేదని దుయ్యబట్టారు .

రూ. 5వేల కోట్ల దోపిడీ
ఈ 30 నెలల పాలనలో ఒక్క ఇల్లు అయినా కట్టావా అని జగన్ ని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ హయం నుంచి చంద్రబాబు పాలన వరకు ఇచ్చిన ఇళ్లపై జగన్ ఇప్పుడు పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లపై సీఎం జగన్ కి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. విలువ లేని రిజిస్ట్రేషన్లతో 5వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు.

ఉచితంగా ఓటీఎస్
టీడీపీ హయంంలో 2014 నుంచి 2019 వరకు 7.52లఓల ఇళ్లు కట్టిందని గుర్తు చేశారు. ఇంత వరకు వాటిని లబ్ధిదారులకు ఇవ్వలేదని అచ్చన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో 32 లక్షల ఇళ్లు కడతామంటూ ప్రగల్బాలు పలికారు.. వాటిని ఎలా కడతారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఉచితంగా ఓటీఎస్ చేయాలని కోరారు. ఏ ఒక్క పేదవాడు ఓటీఎస్ కట్టవద్దని .. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగానే రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు.

వైసీపీ నేతల పైశాచిక ఆనందం
రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు
. గుంటూరు జిల్లా పెదనందిపాడులో టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై హత్యాయత్నం దుర్మమార్గమని మండిపడ్డారు. నారాయణకు ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వైసీపీ నేతలు అభినవ రక్తపిశాచాలుగా మారారని దుయ్యబట్టారు. తప్పును తప్పు అని చెప్పినా చంపేస్తారా అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు , హత్యలు చేసిన వైసీపీ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారుని మండిపడ్డారు. తమ కార్యకర్తలకు జరిగిన ప్రతి దాడికీ సమాధానం చెప్పడం తధ్యమని హెచ్చరించారు.