ఏపీలో ముందస్తు ఎన్నికలు ?.. జగన్ రాక్షస పాలనకు అంతం .. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో జగన్ రాక్షస ప్రభుత్వం సాగుతుందని విమర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు . సీఎం జగన్ తన చేతగాని పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పేదలను దోచుకుంటూ పబ్బంగడుపుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు.

జగన్ రాక్షస పాలన..
వచ్చే ఎన్నికల్లో ఆరు నూరైన మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని దీమా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంటరీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన సాగుతుందని దుయ్యబట్టారు. పన్నులతో పేదలను పీక్కుతింటున్నారని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ తండ్రి, తాతా, ముత్తాతలు కూడా టీడీపీని ఏం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వడ్డీతో సహా చెల్లిస్తాం..
టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా వైసీపీ నేతలకు చెల్లిస్తామని హెచ్చరించారు. ఓటిఎస్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. జగన్‌కు జనం గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని విమర్శించారు. ఏపీ అంటే అస్యహించుకునే పరిస్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. ఏపీ ఆస్తులను తెలంగాణకు దోచిపెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు..

.ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చు..
ఏపీలో ఏ సమయంలోనైనా ఎన్నికలు రావచ్చని ఎంపీ రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు . అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని తెలగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ జండా చూస్తే వైసీపీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలన్నారు. ఇంత కాలం టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. ఇక మనం భయపడే రోజులు పోయాయి.. జగన్ భయపడే రోజులు వచ్చాయన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రత్యేక హాదా, రైల్వే జోన్ గురించి అడగలేని దద్దమ్మన్నారు. .. స్టీల్ ప్లాంట్‌పై కేంద్రాన్ని నిలదీయలేదని ముఖ్యమంత్రి జగన్.. ప్రదాని మోదీ కాళ్లు మొక్కుతున్నారని ఆరోపించారు.

లిక్కర్ వ్యాపారం చేసే సీఎం ఎవరైనా ఉన్నారా ?
ఈసారి ఎన్నికల్లో టీడీపీకి 151 సీట్లకుపైగా రావాలన్నారు రామ్మోన్ నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎలా కష్టపడుతున్నారో ప్రతికార్యకర్త కూడా అలాగే కష్టపడాలన్నారు. లిక్కర్ వ్యాపారం, చేపల వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు కట్టించిన ఇళ్లకి జగన్‌కు ఎందుకు డబ్బులు కట్టాలని నిలదీశారు. పేదల నుంచి ముక్కు పింటి వసూల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్కరూ కట్టాల్సిన అవసరం లేదు. టీడీపీ అధికారంలోకి రాగేనే ప్రతి ఒక్కరికి ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ చేతగాని పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.