వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీట్‌ జాతీయ పూల్‌లోకి ఏపీ, తెలంగాణ... 371డి నిబంధన నుంచి కేంద్రం మినహాయింపు

నీట్ జాతీయ పూల్‌లోకి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చినట్లు ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: నీట్ జాతీయ పూల్‌లోకి ఆంధ్రప్రదేశ్ కూడా ప్రవేశించింది. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్ తెలిపారు.

మంగళవారం ఢిల్లీకి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైద్య విద్య సీట్ల భర్తీలో 371డి నిబంధన నుంచి ఏపీకి కేంద్రం మినహాయింపు ఇచ్చిందంటూ అందుకు ధన్యవాదాలు తెలిపారు.

kamineni-srinivas

నీట్ జాతీయ పూల్‌లోకి ఏపీతోపాటు తెలంగాణ, జమ్ముకాశ్మీర్ కూడా వచ్చాయన్నారు. వచ్చే ఏడాది (2018-19) నుంచి 371డి నిబంధన నుంచి ఏపీకి మినహాయింపు లభించనుందని, జాతీయ పూల్‌లో చేరడంవల్ల వచ్చే ఏడాది నుంచి వైద్య సీట్లలో రాష్ట్ర విద్యార్ధులు ఎంబీబీఎస్, పీజీలో ఎక్కువ సీట్లకు పోటీపడే అవకాశం లభించడం కలిసి వచ్చే అంశమని చెప్పారు.

దేశవ్యాప్తంగా 27,710 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా ఏపీలో 1900 సీట్లు ఉన్నాయని, రాష్ట్రం జాతీయ పూల్‌ కింద 15 శాతం సీట్లు (285) కోల్పోయినా జాతీయస్థాయిలో 16 రెట్లు అధికంగా(4482) సీట్లకు పోటీపడే అవకాశం లభిస్తుందని వివరించారు.

అలాగే దేశవ్యాప్తంగా 13,872 పీజీ సీట్లు ఉండగా మన రాష్ట్రంలో 660 సీట్లు ఉన్నాయని, వీటిలో 50శాతం అంటే 330 జాతీయ పూల్‌కు ఇస్తే దేశవ్యాప్తంగా 7236 పీజీ సీట్లకు పోటీపడేందుకు అవకాశం ఉందన్నారు.

371డి నిబంధన మినహాయింపు, ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్ధుల అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో మంగళవారం మరోసారి సమావేశం కానున్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.

English summary
Minister for Medical and Health of Andhra Pradesh State Kamineni Srinivas told that AP, Telangana & Jammu Kashmir entered into Neet National Pool. While speaking with press reporters here in Delhi on Tuesday he told that AP got exemption from Rule 371D from the coming academic year. Minister Kamineni also told that he is going to meet Central Minister Nadda once again on Tuesday to discuss about the exemption from the Rule 371D and Fathima Medical College students issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X