వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తేలని ఏపీ, తెలంగాణా ఆర్టీసీ పంచాయితీ .. దసరాకైనా బస్సులు నడుస్తాయా ?

|
Google Oneindia TeluguNews

దసరా పండుగ హడావిడి మొదలైంది. మొన్నటి దాకా కరోనా కారణంగా ఇళ్లకే పరిమితం అయిన వారు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు . ఇక పెద్ద పండుగ దసరాకు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. అయితే హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ కు దసరా పండుగ దగ్గర పడుతున్నా ఏపీకి బస్సులు నడవకపోవటం నిరాశను కలిగిస్తుంది . ఏపీ నుండి తెలంగాణాకు గతంలో బస్సు సర్వీసులు ఎక్కువగానే నడవటం వల్ల ఎపీకే ఇప్పుడు బస్సులు నడవకపోవటంతో ఎక్కువ నష్టం వస్తుంది . నేడో , రేపో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్న నేపధ్యంలో బస్సులు పునరుద్ధరిస్తారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Recommended Video

Bus Services Between Two Telugu States Update | Oneindia Telugu

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నాని అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఎప్పుడు నడుస్తాయో .. కేసీఆర్ నే అడగాలన్న మంత్రి పేర్ని నాని

 దసరా బస్సుల కోసం ఏపీ, తెలంగాణా ప్రజల ఎదురుచూపు

దసరా బస్సుల కోసం ఏపీ, తెలంగాణా ప్రజల ఎదురుచూపు


ప్రతి ఏడూ దసరాకు , సంక్రాంతికి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి వెళ్తుంటారు. తమ సొంత ఊళ్ళో తమ వారితో కలిసి గడుపుతుంటారు . కానీ ఈసారి దసరాకు ఏపీ వెళ్ళటం ప్రజలకు కష్టంగా మారుతుంది. కరోనా లాక్ డౌన్ సమయంలో బస్సులను నిలిపివేసిన తర్వాత ఇప్పటి వరకు అంతరాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణకు ప్రభుత్వాలు పలు మార్లు చర్చలు జరుపుతున్నా చర్చలు మాత్రం ఫలించటం లేదు . ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి ఇరురాష్ట్రాల ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చలుఇప్పటికి నాలుగు దఫాలుగా జరిగినా అవి సందిగ్ధంగానే ముగిశాయి.

 ఏపీ, తెలంగాణా ఆర్టీసీ చర్చలు .. పట్టు పడుతున్న తెలంగాణా

ఏపీ, తెలంగాణా ఆర్టీసీ చర్చలు .. పట్టు పడుతున్న తెలంగాణా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య ఎన్ని కిలోమీటర్లు బస్సులను నడపాలన్న దానిపైన కొంత స్పష్టత వచ్చినా , ఏపీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రానికి ప్రతిరోజు 375 బస్సు సర్వీసులను నడుపుతోంది. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ 206 సర్వీసులకు మాత్రమే పరిమితం కావాలని ఏపీ ముందు ప్రతిపాదన పెట్టింది. తెలంగాణ అధికారుల తీరు మాత్రం తమ ప్రతిపాదనలను ఏపీ ఆమోదించాలి అన్న పట్టుదలతోనే ఉన్నట్లుగా కనిపిస్తుంది.

 బస్సు సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటాయా ?

బస్సు సర్వీసులు నడిపేందుకు నిర్ణయం తీసుకుంటాయా ?

తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లకు కొంతమేర సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని 1.61 లక్షల కిలోమీటర్ల మేర సర్వీసులు నడుపుతామంటూ అంగీకరించినా, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. ఇక ఇదే సమయంలో సోమ, మంగళ వారాల్లో నిర్ణయం తీసుకొని ముందుగా కొన్ని సర్వీసులు నడిపేందుకు అంగీకరిస్తే దసరాకు ఇరు ఆర్టీసీలు బస్సులు నడిపే అవకాశం ఉంటుంది.

బెంగళూరు బస్సు సర్వీసుల కోసం ..టీఎస్ఆర్టీసీ తాజా ప్రతిపాదన

బెంగళూరు బస్సు సర్వీసుల కోసం ..టీఎస్ఆర్టీసీ తాజా ప్రతిపాదన

టిఎస్ఆర్టిసి దసరా నేపథ్యంలో హైదరాబాద్ - బెంగళూరు మధ్య కర్నూలు, అనంతపురం మీదుగా బస్సు సర్వీసులు నడుపుతామని ఏపీఎస్ఆర్టీసీని కోరింది. అయితే ఏపీకి సర్వీసులపై తేలిన తర్వాతనే బెంగళూరు సర్వీసులను అనుమతిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెప్పారు.

గతంలో ఏపీఎస్ఆర్టీసీ పండగ సీజన్ కావడంతో ముందు బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ప్రతిపాదించినప్పుడు, టి ఎస్ ఆర్ టి సి మొత్తం ప్రతిపాదిత అంశాలపై తేల్చుకున్న తర్వాతే బస్సులు నడపడం గురించి ఆలోచిద్దాం అంటూ ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఇక తాజాగా టిఎస్ఆర్టిసి ప్రతిపాదనను ఏపీఎస్ఆర్టీసీ అందుకే తోసిపుచ్చింది.

 ఆర్టీసీ బస్సుల్లేక లాభపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్

ఆర్టీసీ బస్సుల్లేక లాభపడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్

ఇలా టామ్ అండ్ జెర్రీ లా ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపద్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ లాభ పడుతున్నాయి దసరా దగ్గరపడుతున్న కొద్దీ రెట్టింపు చార్జీలు వసూలు చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్ రంగంలోకి దిగాయి. రెండు ప్రభుత్వాల ఆర్టీసీల మధ్య నెలకొన్న వివాదాన్ని గమనించిన ప్రైవేట్ ట్రావెల్స్ ఇక తమ బస్సులు తప్ప ప్రయాణికులకు వేరే దిక్కు లేదని భావించి విపరీతంగా ధరలను పెంచేసి అందినకాడికి దండుకుంటున్నాయి.

English summary
The Dussehra festival rush has begun. Those who were previously confined to their homes due to the corona are now coming out. They are getting ready to go to their own hometowns for the big festival . Settlers in Hyderabad, however, are frustrated that buses do not run to AP as the Dussehra festival approaches. Due to the high number of bus services from AP to Telangana in the past, AP will suffer more due to non-operation of buses now. The big question now is whether the buses will be refurbished today or, tomorrow are expected to decide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X