వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కరోజే 225 మంది మృతి: భానుడి భగభగ, జూలో ఇలా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర్లాల్లో నిప్పుల వాన కురుస్తోంది. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. దీంతో, ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గురువారం నాడు తెలంగాణలో 147 మంది, ఏపీలో 78 మంది మృతి చెందారు. మెదక్ జిల్లాలో 13 నెమళ్లు చనిపోయాయి.

తెలంగాణలో సూర్యాపేటలో 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మరో రెండు మూడు రోజులు ఇలాగే ఉండే అవకాశముంది. కరీంనగర్, మెదక్ జిల్లాలో 31 మంది, ప్రకాశం జిల్లాలో 47 మంది మృతి చెందారు. యాభై ఏళ్ల క్రితం.. 1966లో 47.5 ఉష్ణోగ్రత నమోదైంది. మళ్లీ ఇప్పుడు నమోదైంది.

ఈ రోజు, రేపు రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత ఉండే అవకాశాలున్నాయి. ఒకటి రెండు చోట్ల మినహా అంతటా ఉష్ణోగ్రత 40 దాటింది. నిజామాబాద్, రామగుండం, మెదక్ జిల్లాల్లో అత్యధికంగా ఉంది. హైదరాబాదులోని భారీ ఉష్ణోగ్రత నమోదవుతోంది.

భానుడి భగభగ

భానుడి భగభగ

సూరీడు నిప్పులు కురిపిస్తుండటంతో ఇరు ప్రభుత్వాలు.. అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరిస్తున్నాయి.

భానుడి భగభగ

భానుడి భగభగ

గురువారం అత్యధికంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో సూర్య ప్రతాపం 47.5 డిగ్రీలను చూపింది. నిజామాబాద్‌లో, ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌ల్లో 47 డిగ్రీలను తాకింది. ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

 భానుడి భగభగ

భానుడి భగభగ

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఐదేళ్ల రికార్డు కావడం గమనార్హం.

భానుడి భగభగ

భానుడి భగభగ

2010 మే 12న 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో ఇప్పటిదాకా ఇదే అత్యధికం. ఈసారి పరిస్థితి చూస్తే ఈ రికార్డు కూడా చెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది.

 భానుడి భగభగ

భానుడి భగభగ

రెండు మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 46.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖ అధికారి నర్సింహరావు తెలిపారు.

భానుడి భగభగ

భానుడి భగభగ

గురువారం ఉదయం 9 గంటల నుంచే సూర్యుడి ప్రతాపం మొదలైంది. జనం ఇళ్లు విడిచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తారు. సూర్యుడు విధించిన కర్ఫ్యూకు జడిసిపోయారు. అజా గ్రత్తగా ఉన్న వారు వడదెబ్బ తిన్నారు.

 భానుడి భగభగ

భానుడి భగభగ

ఏటా మే నెలలో ఎండలు మండటం సహజమే. కానీ ఈసారి భానుడి భగభగలకు వడగాడ్పులు కూడా తోడయ్యాయి.

భానుడి భగభగ

భానుడి భగభగ

దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అన్నిచోట్లా మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

భానుడి భగభగ

భానుడి భగభగ

వచ్చే రెండు రోజుల్లో తెలంగాణ, కోస్తాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి బలహీనంగా ఉండడం, దానిపై ఉపరితల ద్రోణి కొనసాగడంతో వాయవ్య గాలులు వీస్తున్నాయి, దీనివల్ల వచ్చే రెండు రోజుల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని నిపుణుల అంచనా.

భానుడి భగభగ

భానుడి భగభగ



గుజరాత్‌, రాజస్థాన్‌ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఉత్తర వాయవ్య దిశ నుంచి దక్షిణాదికి వేడి పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని అంటున్నారు.

English summary
AP, Telangana sizzles in heatwave, 225 dead on Thursday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X