• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ స్నేహ హస్తం అందించినా : మంచితనం బలహీనత కాదు: తెలంగాణ తప్పు చేస్తోంది : మంత్రి అనిల్ ఫైర్..!!

By Lekhaka
|

ఏపీ ప్రభుత్వం ఒప్పందాలను ధిక్కరించి ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపించటం పైన ఇరిగేషన్ మంత్రి అనిల్ స్పందించారు. రాయల సీమలో ఎపీ కడుతోన్న ప్రాజెక్టులన్నీ చట్టానికి లోబడి కడుతున్నవేనని తేల్చి చెప్పారు. ఎపీకి కేటాయించిన నీటి వాటాకు లోబడే ప్రాజెక్టులు కడుతున్నామని స్పష్టం చేసారు. శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగులకు నీరువస్తే నే పోతిరెడ్డి పాడు నుంచి నీరు ఎపీ తీసుకునే అవకాశం ఉందని అనిల్ వివరించారు. పోతిరెడ్డి పాడు నుంచి 44వేల క్యూసెక్కులను కేవలం పదిహేను రోజులు మాత్రమే తీసుకునే పరిస్థితి ఉందన్నారు.

చుక్క నీరు అక్రమంగా వాడుకోలేదు..

చుక్క నీరు అక్రమంగా వాడుకోలేదు..


848 అడుగులకు నీరు ఉంటే పోతిరెడ్డి పాడు నుంచి చుక్క నీరు తీసుకోలేని పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. పోతిరెడ్డి పాడు వద్ద లిఫ్టు పెడితే ఎలా తప్పు అవుతుందో తెలంగాణ చెప్పాలని డిమాండ్ చేసారు. కృష్ణా నది నుంచి చుక్క నీరు కూడా ఎక్కువగా తీసుకోవడం లేదని స్పష్టం చేసారు. తెలంగాణ ప్రభుత్వం 6 టీఎంసీపైగా సామర్థ్యం కల్గిన ప్రాజెక్టులను అనుమతులు లేకుండా కడుతోందని చెప్పారు. శ్రీశైలంలో 800 అడగుల లోపు నీరున్నా ...నీటిని లిఫ్టే చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందని వివరించారు. కల్వకుర్తి బీమా నెట్టెంపాడు సామర్థ్యం పెంచారని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రాజెక్టులు సక్రమమైనవా..

తెలంగాణ ప్రాజెక్టులు సక్రమమైనవా..

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లోనూ లిఫ్టు పెట్టారని.. సుంకేసుల వద్ద తెలంగాణ కడుతోన్న ప్రాజెక్టు సక్రమమైందా అని ప్రశ్నంచారు. మీరు చేస్తే తప్పులేదు...మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా అంటూ నిలదీసారు. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు కట్టడం లేదని తేల్చి చెప్పారు. కృష్ణా నది నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచుతున్నామన్నారు. అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేసామని.. భవిష్యత్తులోనూ తెలంగాణ అక్రమ ప్రాజెక్టు లపై ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అధికారుల స్థాయిలో నీటి సమస్యలు పరిష్కారం కాదన్నారు.

 జగన్ స్నేహ హస్తం అందించినా..

జగన్ స్నేహ హస్తం అందించినా..

సీఎం జగన్ తెలంగాణ స్నేహహస్తం అందించి పరిష్కరించే ప్రయత్నం చేసినా ప్రయోజనం రాలేదని చెప్పారు. నీచి వాటాలపై గడచిన ఐదేళ్లుగా మేము పోరాడుతూనే ఉన్నామన్నారు. నీటి సమస్య పరిష్కారంపై ఇద్దరు సీఎం లు తప్పకుండా కలసి మాట్లాడుకుంటారని .. అపెక్స్ సమావేశంలోనూ ఎవరి వాదనలు వారు వినిపించారని గుర్తు చేసారు. బోర్డు కేటాయించిన నీటినే మేము వాడుకుంటున్నామని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు. కేటాయించిన నీరు కంటే చుక్క కూడా ఎక్కువ వాడుకోవటం లేదని పునరుద్ఘాటించారు. దశాబ్డాలుగా కేటాయించిన వాటిని సుస్తిరం చేసుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఫ్లడ్ సీజన్ తక్కువ ఉంటుంది కాబట్టే రిజర్వాయర్ నింపుకొనే ప్రయత్నం చేస్తున్నామని..కొత్త ఆయుకట్టు క్రియేట్ చేయటం లేదని వివరించారు.

  #KodaliNaniPressMeet : లోకేష్ కాదు, బోకేష్, Jagan ని టచ్ కూడా చెయ్యలేరు || Oneindia Telugu
  కర్రలు తీసుకొని కొట్టుకుంటామా..

  కర్రలు తీసుకొని కొట్టుకుంటామా..


  ఏపీ ఉదాసీనంగా లేదని... కర్రలు తీసుకుని కొట్టుకుంటామా అంటూ అనిల్ ప్రశ్నించారు. మంచి తనం బలహీనత కాదని.. రెండు రాష్ట్రాలు బాగుండాలనే సంకల్పంతో జగన్ ముందుకెళ్తున్నారని వివరించారు. ఇద్దరు సీఎంలు అన్నా దమ్ములుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఎప్పుడు కఠినంగా ఉండాలో సీఎం జగన్ కు తెలుసని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం పూర్తవటంతో ఏమీ చేయలేకపోయినా..మంచి మనసుతో ప్రారంభోత్సవానికి వెళ్లామని మంత్రి అనిల్ చెప్పుకొచ్చారు.

  English summary
  AP irrigation Minister Anil Seriously reacted over Telangana comments on AP Irrigation projects. Anil said that AP did not use a single drop of water against the act.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X