వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థుల్లో స్కిల్ డెవలప్‌మెంట్: టెక్సాస్ యూనివర్సిటీతో ఏపి ఒప్పందం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని ఐటీ ఇంక్యుబేషన్‌ కేంద్రాల్లో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై ఏపి ఐటి మంత్రి పల్లెరఘునాథరెడ్డి సంతకం చేశారు.

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పల్లె నూజెర్సీని సందర్శించారు. ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు స్పార్క్‌సాఫ్ట్‌, సీవెసీ గ్రూప్‌ ఇంకీ, తడ్‌ ఇండియా, ట్జార్‌ ఇన్వెస్టిమెంట్స్‌, ఏపీ సాఫ్ట్‌, ఆబ్జెక్ట్‌ సిస్టమ్స్‌ నెట్‌, ఇ-మెడ్‌ ఈవెంట్స్‌ డాట్‌కామ్‌ వంటి సుమారు 30 సంస్థలు ఆసక్తి వ్యక్తీకరిస్తూ పత్రాలు అందజేశాయని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి వెల్లడించారు.

AP and Texas University MOU on Skill development

న్యూజెర్సీలోని న్యూబ్రీన్స్‌విక్‌లో రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థల సీఈవోలు రాజ్‌ తలసిల, గోపాల్‌, నవీన్‌ చౌదరి కోతాల, రత్న ముల్పూరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మంత్రి పల్లె పాల్గొన్నారు.

ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రవాసాంధ్రులుభాగస్వాములుకావాలని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఐటీ, ఎలక్ట్రానిక్‌ విధానాలు, రాయితీలను వివరించారు. కాగా, ఈ సందర్భంగా 'నా ఇటుక-నా అమరావతి' ద్వారా రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకు ఎన్నారైలు ఆదివారం 4లక్షల ఈ-ఇటుకలు కొనుగోలు చేశారు.

English summary
Andhra Pradesh and Texas University have signed on MOU on Skill development in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X