అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్విస్ ఛాలెంజ్‌పై జగన్ కంటే రెండాకులు ఎక్కువే: 'ఇక్కడి దొంగలే సింగపూర్ పేరుతో..'

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా, సీపీఎం నేత రాఘవులు వైసిపి కంటే ఓ అడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదల భూములే

పేదల భూములే

నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం కేవలం పేదల భూములే సేకరిస్తున్నారని రాఘవులు మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భూమి విలువలు పెంచి భూసేకరణ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

స్విస్ ఛాలెంజ్‌కు ఇక్కడి దొంగలే

స్విస్ ఛాలెంజ్‌కు ఇక్కడి దొంగలే

స్విస్ ఛాలెంజ్ కోసం వచ్చేది సింగపూర్ వాళ్లు కాదని, ఇక్కడి దొంగలే సింగపూర్ ద్వారా వస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా వైసిపి కంటే ఓ అడుగు ముందుకేశారు. బోగస్ విద్యా సంస్థలకు ఇక్కడ భూములు ఇవ్వడం సరికాదన్నారు.

జగన్ కంటే రెండాకులు ఎక్కువే

జగన్ కంటే రెండాకులు ఎక్కువే

కాగా, ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానం ద్వారా అమరావతిని నిర్మించనున్న విషయం తెలిసిందే. దీనిపై వైసిపి మొదటి నుంచి మండిపడుతోంది. మన దేశంలో మంచి ఇంజినీర్లు ఉండగా సింగపూర్‌కు, జపాన్‌కు, చైనాకు రాజధాని నిర్మాణ బాధ్యతలు కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

రాజధాని పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలకు తెరలేపుతోందని ఆరోపిస్తున్నారు. ఇతర దేశాలకు రాజధాని నిర్మాణ బాధ్యతలు ఇచ్చి, కమీషన్ కొట్టేసేందుకు ఇదంతా అని మండిపడుతున్నారు. ఇప్పుడు రాఘవులు ఏకంగా.. అసలు సింగపూర్ పేరుతో ఇక్కడి వారే వస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

English summary
CPM leader Raghavulu on Tuesday alleged that AP thieves are coming with the name of Singapore to built Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X