వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజధాని మార్పు: రంగంలోకి మోదీ! - గవర్నర్‌కు పీఎంవో కాల్?.. ఇటు హైకోర్టూ కీలక ఆదేశాలు..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాజధాని వికేంద్రీకరణ అంశంపై కాదుకంటూనే కేంద్రం జోక్యం చేసుకుంటున్నదా? రాజధాని ఏర్పాటు పూర్తిగా రాష్ట్ర పరిధిలోనే అంశమే అని బీజేపీ నేతలు చెబుతున్నదానికి, వాస్తవ పరిస్థితికి పొంతనేదా? అంటే జరుగుతోన్న పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజధాని బిల్లులు తిరిగి గవర్నర్ చెంతకు చేరిన వేళ వాటిపై ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అందుకు దారితీసిన పరిణామాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మరోవైపు ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్జగన్ గృహప్రవేశం నాడే రోజా కుండబద్దలు - వేణుగోపాల్ మాటే ఫైనల్ - రఘురామకు రాష్ట్రపతి రివర్స్ షాక్

అసలేం జరుగుతోందంటే..

అసలేం జరుగుతోందంటే..

ఏపీలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొంది, మండలిలో తిరస్కరణు గురై, నిర్ణీత గడువు ముగియడంతో గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ చేరాయి. శాసన ప్రక్రియలో భాగంగా ఆ బిల్లుల్ని న్యాయశాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం పున:పరిశీలన అనంతరం తిరిగి గవర్నర్ వద్దకు చేరాయి. బిల్లులపై గవర్నర్ న్యాయసలహా తీసుకుంటారా? లేక యథాతథంగా ఆమోదిస్తారా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే.. వీటిపై ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం.. గవర్నర్ ను ఆరా తీసినట్లు ప్రముఖ వార్తా సంస్థలు రిపోర్టు చేశాయి.

రంగంలోకి మోదీ కార్యాలయం..

రంగంలోకి మోదీ కార్యాలయం..

వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు గవర్నర్ కోర్టులో ఉన్నందున.. వాటిని ఆమోదించవద్దంటూ అఖిల భారత హిందూమహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జీవీఆర్ శాస్త్రి రాష్ట్రపతికి, ప్రధాని కార్యాలయానికి గతంలో లేఖలు రాశారు. ఆ లేఖపై స్పందించిన పీఎంవో.. గవర్నర్ ను వివరాలు అడిగిందని, రాజధాని మార్పు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ఆరా తీసిందని మీడియాలో రిపోర్టులు వచ్చాయి. దీనిపై పీఎంవోగానీ, రాజ్ భవన్ గానీ అధికారిక ప్రకటనలు చేయలేదు. కానీ మీడియాలో వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయ.

అమరావతిపై హిందూమహాసభ ఫోకస్..

అమరావతిపై హిందూమహాసభ ఫోకస్..

ఏపీలో పాలన వికేంద్రీకరణ కోసం జగన్ సర్కారు మూడు రాజధానుల బిల్లును ప్రతిపాదించిన తర్వాతికాలంలో అఖిల భారత హిందూమహాసభ అమరావతిపై ఫోకస్ మరింత పెంచింది. శాసన మండలి సెలెక్ట్ కమిటీ, హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారాలపై ముందుకు వెళ్లరాదని, అలా చేయడం ఏపీ పునర్విభజన చట్టం-2014కు విరుద్ధమని హిందూమహాసభ వాదిస్తున్నది. అదేసమయంలో.. అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించబోయే ఆలయం తరహాలోనే అమరావతిలో దక్షిణ భారత రామాలయాన్ని నిర్మిర్మించేందుకు హిందూమహాసభ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆలయ నిర్మాణానికి బీజేపీ నేతలతోపాటు వైసీపీ రెబల్ నేతలు సైతం భారీగా విరాళాలు ప్రకటించారు. మరోవైపు..

రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే..

రాజధానిపై నిర్ణయం కేంద్రానిదే..

ఆంధ్రప్రదేశ్ లో పాలన వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటు, ఆ మేరకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు అలాగే సీఆర్డిఏ రద్దు బిల్లు.. తదితర అంశాలపై ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన సంగంతి తెలిసిందే. ఆ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన హైకోర్టు.. విచారణను వాయిదా వేసింది.

కరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలుకరోనాపై జగన్ చెప్పినట్లే జరుగుతోంది.. అంబటి రాంబాబుకూ పాజిటివ్.. చికిత్సలపై టీడీపీ విమర్శలు

Recommended Video

YSRCP MLA Ambati Rambabu Tested COVID-19 Positive,Video Gone Viral || Oneindia Telugu
వరుస దెబ్బలు.. ఈసారి ఎలా?

వరుస దెబ్బలు.. ఈసారి ఎలా?

వైఎస్ జగన్ ఏడాది పాలనలో సరికొత్త వెల్ఫేర్ స్కీములతో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. విధానపరమైన కీలక నిర్ణయాల్లో మాత్రం న్యాయవ్యవస్థల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. కొన్ని పథకాలతోపాటు ఎన్నికల కమిషనర్ పునర్నియామకం, ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు తదితర అంశాల్లో జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకుంటోందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా రాజధని విషయంలో పీఎంవో ఆరా తీసిందంటూ వార్తలు వస్తోండటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

English summary
andhra pradesh high court on thursday hears petition on three capitals decision took cm ys jagan and asked center and ap govt to file counter. several media report says that pmo also enquiries ap governor on this issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X