వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయసాయిరెడ్డి.. ఇంకా పులుపు చావలే - అమరావతిలో సునామి - టీడీపీ ఫైర్ - గోల్కొండను లోకేశ్ కట్టాడా?

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ తారాస్థాయికి చేరింది. విశాఖపట్నానికి ఈస్టరన్ నేవీ కమాండ్ తెచ్చింది తానే అంటూ మాజీ ఎంపీ సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలైన తర్వాత.. ఎవరెవరు చరిత్రాత్మక పనులు చేపట్టారనేదానిపై నేతల మధ్య వాదప్రతివాదాలు ఇంకాస్త వేడెక్కాయి. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబును ప్రస్తావిస్తూ సెటైర్లు వేయగా, ఆయనకు టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలు కౌంటరిచ్చారు.

కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?కొత్త జిల్లాలపై జగన్ సర్కారు ట్విస్ట్ - రాత్రికిరాత్రే జీవో సవరణ - సవాళ్లు - ఏపీలో కేసీఆర్ ఫార్ములా?

చార్మినార్ కట్టింది లోకేశా?

చార్మినార్ కట్టింది లోకేశా?


విశాఖకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి ఓ టీవీ చానెల్ చర్చలో మాట్లాడుతూ.. భూదందాల కోసమే వైసీపీ రాజధానిని విశాఖకు తరలిస్తున్నదని, నిజానికి తన కృషి వల్లే ఈస్టరన్ నేవీ కమాండ్ ఏర్పాటైందని, ఘాజీ సబ్ మైరన్ ను కూడా తానే తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. 1968లో ఏర్పాటైన నేవీ కమాండ్ కు, 1971నాటి ఘాజీ సబ్ మెరైన్ ఘటనకు మాజీ ఎంపీతో లింకేంటని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తాయి. చంద్రబాబు డైరెక్షన్ లో టీడీపీ, దాని అనుబంధ నేతలంతా ఇదే తీరుగా మాట్లాడుతారని వైసీపీ నేతలు విమర్శించారు. ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయిరెడ్డి.. చంద్రబాబు పదే పదే చెప్పే ఓ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘చంద్రబాబు హైదరాబాద్ నేనే కట్టానంటున్నారు. మరి గోల్కొండ, చార్మినార్, హుస్సేన్‌సాగర్, ఉస్మానియా యూనివర్శిటీలను నారా లోకేశ్ కట్టాడా?''అని సెటైర్ వేశారు.

మోదీ-విజయన్ మధ్యలో నేను బలి - స్వప్న సురేశ్ మరో సంచలనం - దిమ్మతిరిగేలా ఎన్ఐఏ రియాక్షన్మోదీ-విజయన్ మధ్యలో నేను బలి - స్వప్న సురేశ్ మరో సంచలనం - దిమ్మతిరిగేలా ఎన్ఐఏ రియాక్షన్

చింత చచ్చినా పులుపు చావలేదంటూ..

చింత చచ్చినా పులుపు చావలేదంటూ..

చంద్రబాబు, నారా లోకేశ్ లను ఉద్దేశించి వైసీపీ సాయిరెడ్డి చేసిన కామెంట్లపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైరయ్యారు. చంద్రబాబు ఏం కట్టించారో ప్రపంచానికి తెలుసని, వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మీరేం కట్టారో చెప్పండంటూ నిలదీశారు. ‘‘విజయసాయి రెడ్డి.. మీకు "చింత చచ్చినా పులుపు చావలేదు". చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు. హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్ ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి?'' అని వర్ల ప్రశ్నించారు.

అమరావతిలో సునామి?

అమరావతిలో సునామి?

టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ కామెంట్ల నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సైతం కలుగజేసుకుంటూ కౌంటర్లు వేశారు. అమరావతిని ధ్వంసం చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తున్నదని, కరోనా వేళ ఇస్తానన్న మూడు మాస్కులు కూడా ఇవ్వలేని వాళ్లు మూడు రాజధానులు నిర్మిస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘లాఫింగ్ బుద్ధా'' శీర్షికతో వైసీపీపై పంచులు విసురుతోన్న వెంకన్న.. గ్రాఫిక్స్, స్మశానం, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఉపాయాలేవీ ఫలించలేదని, అమరావతిలో సునామి వస్తుందనే ప్రచారం చేస్తే తప్ప పథకం పారదని జగన్, సాయిరెడ్డిలు మాట్లాడుతున్నట్లుగా విమర్శలు చేశారు.

ఆదివాసులు - చంద్రబాబు మోసాలు..

ఆదివాసులు - చంద్రబాబు మోసాలు..

మూడు రాజధానుల ఆవశ్యకతను వివరిస్తూ, గత చంద్రబాబు హయాంలో ఒక్కో ప్రాంతం, ఒక్కో వర్గం ఏ విధంగా నష్టపోయిందో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సిరీస్ రూపంలో ఏకరువుపెడుతున్న సంగతి తెలిసిందే. సోమవారం తాజాగా ‘‘ఆదివాసులు - చంద్రబాబు మోసాలు'' శీర్షికతో ఎంపీ విమర్శలు చేశారు. ‘‘తన 14 ఏళ్ల పాలనలో చేసిందేమీ లేకపోగా... బాక్సైట్ ను కొల్లగొట్టేందుకు అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొని... వారి సాయంతో తన దోపిడీ కొనసాగించాలనుకున్నాడు. పచ్చ ఛానళ్లు, పచ్చ పత్రికల్లో ఊదరగొట్టడం మినహా గిరిజనులకు ఒక్కటంటే ఒక్క కార్యక్రమంకూడా చేయలేదు. ఒక్క ఇంచ్ భూమికి పట్టానిచ్చిన పాపానపోలేదు. చివరకు గిరిజన సలహామండలినీ నియమించలేదు. అంతా పైన పటారం లోపల లొటారం''అని సాయిరెడ్డి తెలిపారు.

అడవిబిడ్డల గుండెల్లో వైఎస్సార్..

అడవిబిడ్డల గుండెల్లో వైఎస్సార్..


తన హయాంలో వైఎస్సార్ గిరిపుత్రులకు చేసిన మంచి పనుల కారణంగా వారి గుండెల్లో నిలిచిపోయారని, అందుకే మొన్నటి ఎన్నికల్లో ఏపీలోని మొత్తం ఏడు ఎస్టీ రిజర్వుడు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలిచారని, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో విద్యుత్ బల్బులేని గిరిజన గూడెం ఉంటుందేమోకానీ, ఆంధ్రాలో వైఎస్ఆర్ , జగన్ ఫొటోలు లేని ఆదివాసి పల్లె లేదంటే ఏమాత్రం అతిశయోక్తికాదని ఎంపీ సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలో గిరిజన మంత్రిగానీ, గిరిజన సలహామండలిగానీ లేవని, అదే జగన్ కేబినెట్ లో గిరిజన మహిళ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం వైసీపీ సర్కారు కట్టుబడి ఉందని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.

English summary
amid three capitals in andhra pradesh, opposition tdp leader varla ramaiah, buddha venkanna slams ysrcp mp vijayasai reddy. the mp took twitter to criticise chandrababu and his son nara lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X