• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం

|

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉనికిలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కార్యానిర్వాహక యంత్రాంగాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే కంటే ముందు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని అధికార వైసీపీ భావిస్తుండగా, అమరావతి నుంచి ఒక్క కార్యాలయాన్నీ తరలిపోనివ్వమని, ప్రజారాజధానిని కాపాడుకుంటామని ప్రతిపక్షాలు సవాలు చేస్తున్నాయి. జాతీయ పార్టీలుగా భిన్న ధృవాలైన బీజేపీ, కాంగ్రెస్ లు అమరావతి విషయంలో ఒకే డిమాండ్ చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే..

  Breaking: AP's 3 Capitals Bill Approved By Governor న్యాయస్ధానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఉత్కంఠ ?

  జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఆశాభావం - ఆసక్తికర వ్యాఖ్యలు - ఎస్ఈసీగా తిరిగి బాధ్యతల్లోకి..జగన్ సర్కారుపై నిమ్మగడ్డ ఆశాభావం - ఆసక్తికర వ్యాఖ్యలు - ఎస్ఈసీగా తిరిగి బాధ్యతల్లోకి..

  రాఖీ నిరసన..

  రాఖీ నిరసన..

  రాజధాని ఉద్యమంలో బీజేపీ-జనసేన సహా అన్ని పార్టీలూ తమతో కలిసి రావాలని అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ నాయకత్వంలో మహిళా జేఏసీ సోమవారం వినూత్న ఆందోళన చేపట్టింది. ‘‘రాఖీ నిరసన'' పేరుతో జగన్, మోదీ సర్కార్లు.. ఆంధ్రా ఆడపడుచులకు చేస్తోన్న అన్యాయాన్ని జేఏసీ ఎకరువుపెట్టింది. తెలుగు మహిళలకు తీరని వేదనగా మారిన మూడు రాజధానుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

   పండుగ పూట శవయాత్ర..

  పండుగ పూట శవయాత్ర..

  మహిళా కాంగ్రెస్ చీఫ్ సుంకర పద్మశ్రీ, ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన కీలక నేతల నేతృత్వంలో జేఏసీ చేపట్టిన ‘రాఖీ నిరసన'లో భాగంగా అనూహ్య చర్యకు దిగారు. పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా పాడెపై ప్రభుత్వ దిష్టిబొమ్మను ఉంచి, ఊరేగింపులా శవయాత్ర నిర్వహించి, చివరికి ఖననం చేశారు. దారిపొడవునా మహిళలు.. ‘‘రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసావు నాయనా.. భూములు ఇచ్చే రైతులను నిలువునా ముంచావు నాయనా..'' అంటూ శోకాలు పెట్టారు.

  రాజధానిపై వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు - ఉపఎన్నికకు సిద్ధం - ఆ 29 ఎమ్మెల్యేలపై ఒత్తిడి?రాజధానిపై వల్లభనేని వంశీ అనూహ్య కామెంట్లు - ఉపఎన్నికకు సిద్ధం - ఆ 29 ఎమ్మెల్యేలపై ఒత్తిడి?

  జగన్ నేరుగా.. బీజేపీ వెన్నుపోటు..

  జగన్ నేరుగా.. బీజేపీ వెన్నుపోటు..

  ‘‘రాజధానిని అమరావతి నుంచి తరలించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు కోట్ల మందికి, మరీ ప్రధానంగా మహిళలకు తీరని అన్యాయం చేశాయి. సీఎం జగన్ నేరుగా పొడిస్తే.. కేంద్రం బీజేపీ సర్కారు మాత్రం వెన్నుపోటు పొడిచింది. ఇన్ని నెలలుగా మహిళలు చేస్తోన్న అవిశ్రాంత పోరాటం వీళ్లకు కనిపించడం లేదా? ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపన చేసి కూడా ఇప్పుడు అమరావతిని చంపేస్తారా? రాష్ట్రంలోని మహిళలెవరూ ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి అంగీకరించరు. అమరావతిని కాపాడుకునేదాకా మా ఉద్యమం ఆగదు'' అని ఏపీ మహిలా కాంగ్రెస్ చీఫ్ సుంకర పద్మశ్రీ అన్నారు.

  ఎమ్మెల్యే శ్రీదేవిపై మహిళా జేఏసీ ఫైర్..

  ఎమ్మెల్యే శ్రీదేవిపై మహిళా జేఏసీ ఫైర్..

  రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ నిరసనలు చేస్తున్నవాళ్లు పెయిడ్ ఆర్టిస్టులంటూ తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి అనుచిత కామెంట్లు చేశారని మహిళా జేఏసీ మండిపడింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపడుతూ, కొందరు నిరసకారులు ఆమె ఇంటి వద్ద నిరసన చేపట్టేందకు వెళ్లగా.. వారిని పోలీసులు అరెస్టు చేశారని జేఏసీ నేతలు తెలిపారు. అరెస్టు చేసిన నిరసనకారుల్ని వెంటనే విడుదల చేయాలని మహిళా జేఏసీ డిమాండ్ చేసింది. సోమవారం నాటి శవయాత్ర కార్యక్రమంలో మహిళా జేఏసీ నేతలు గద్దె అనురాధ,పెనుమత్స దుర్గాభవాని, యార్లగడ్డ సుచిత్ర, నార్ల మాలతి, సుభ, బొప్పన నీరజ, దోనేపూడి రమ తదితరులు పాల్గొన్నారు

  పవన్ నాయకత్వంలో కాంగ్రెస్?

  పవన్ నాయకత్వంలో కాంగ్రెస్?

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, కార్యకర్తలకు మహిళల్ని వేధించడం బాగా అలవాటైందని పద్మశ్రీ ఆరోపించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పుడు తానే ప్రశ్నార్థకంగా మారాడని ఎద్దేవా చేశారు. అయితే, ఇకనైనా పవన్ తన అభిమానులతో మంచి పనులు చేయించాలని, మూడు రాజధానుల అంశంలో స్పష్టమైన వైఖరితో ముందుకు రావాలని, అదే జరిగితే మహిళా కాంగ్రెస్ సహా ఆడపడుచులంతా పవన్ నాయకత్వంలో నడుస్తామని పద్మశ్రీ వ్యాఖ్యానించారు.

  English summary
  Rejecting three capitals, andhra pradesh mahila congress launches Rakhi Protest across the state on monday. ap mahila congress chief Sunkara Padmasree slams cm jagan, bjp and pawan kalyan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X