వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే కరోనా టెస్టుల్లో ఏపీ టాప్ ... రికవరీలోనూ రికార్డ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ర్యాపిడ్ టెస్టులు చెయ్యాలని , మండలాల వారీగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం . ఇక రోజు వారీగా కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిని తెలుసుకుని, అధికారులకు తగిన సూచనలు చేస్తున్నారు.ఈ క్రమంలో నేడు జరిగిన సమీక్షలో రాష్ట్రంలో ఇప్పటివరకు మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు.

తెనాలిలో కరోనా పేషెంట్ పై.. అతని తండ్రితోపాటు పలువురిపై కేసు నమోదు ... రీజన్ ఇదే !!తెనాలిలో కరోనా పేషెంట్ పై.. అతని తండ్రితోపాటు పలువురిపై కేసు నమోదు ... రీజన్ ఇదే !!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 1,91,874 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో అధిక సగటు నమోదుతో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 10,730 టెస్టులు నిర్వహించారు. ఇక 10 లక్షల‌ జనాభాకు 3,593 పరీక్షలతో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. ఏపీలో జరిగినంతగా కరోనా పరీక్షలు మరే ఇతర రాష్ట్రాలలో జరగటం లేదంటే అతిశయోక్తి కాదు.

AP top in corona Tests in india .. record in recovery also

దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల రేటు 4.02 శాతం నమోదవుతుంటే.. ఏపీలో 1.07 శాతంగా ఉంది.ఇక కరోనా టెస్ట్ లలోనే కాదు రికవరీ రేటు లో కూడా ఆంధ్ర ప్రదేశ్ రికార్డు సృష్టిస్తుంది. రికార్డ్ స్థాయిలో రికవరీ రేటు 51.49 శాతంగా నమోదయ్యింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1056 మంది డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 31.86 శాతం అయితే ఏపీలో మాత్రం ఏపీలో 51.49 శాతంగా రికవరీ రేటు ఉంది. మరణాల రేటు కూడా దేశీయ సగటు కంటే తక్కువగా ఏపీలో 2.24 శాతంగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇక సీఎం జగన్ నిత్యం కరోనా వైరస్ కేసుల విషయంలో సమీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . కరోనా పట్ల తీవ్ర భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని మరో మారు నేడు జరిగిన సమీక్షలో సీఎం స్పష్టం చేశారు. వైరస్‌ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరి కాదన్నారు. వైరస్‌ పట్ల భయం, ఆందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. వైరస్‌ పట్ల అవగాహన పెంచుకోవడంతోపాటు, చికిత్స చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.

English summary
The state of Andhra Pradesh has recorded a record 1,91,874 cases of coronavirus tests in the state so far, the Andhra Pradesh state said. In the past 24 hours, 10,730 tests were conducted. The andhrapradesh state is ranked number one in the country with 3,593 tests per 10 lakh population. It is no exaggeration to say that corona exams are taking place in other states are very less compare to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X