వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వాహనదారులకు షాక్ ఇచ్చే రూల్స్ తో రవాణా శాఖ రెడీ ... హెల్మెట్ లేకున్నా బాదుడే

|
Google Oneindia TeluguNews

ఏపీలో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం కానున్నాయి . ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తున్న ఏపీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠిన తరం చెయ్యనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఇప్పటికే కఠిన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అనవసరంగా ఇబ్బంది పడతారు అని హెచ్చరిస్తోంది.

ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!ఏపీ, తెలంగాణా బస్సుల రవాణాపై వీడని సస్పెన్స్ ... నేడు మరోమారు భేటీ .. చర్చలు ఫలిస్తాయా!!

 హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ .. వెయ్యి రూపాయలు జరిమానా ..3నెలలు లైసెన్స్ క్యాన్సిల్

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ .. వెయ్యి రూపాయలు జరిమానా ..3నెలలు లైసెన్స్ క్యాన్సిల్

హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే వెయ్యి రూపాయలు జరిమానా కట్టాలని, మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు కూడా పడుతుంది అని హెచ్చరిస్తోంది ఏపీ సర్కార్. కేంద్రం నూతన మోటార్ వాహన చట్టం అమలు అయితే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయని చెప్తున్నారు . గతేడాది సెప్టెంబర్ 1 నుండి కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే . అయితే ఈ చట్టం లో ఉన్న 11 సెక్షన్లలో జరిమానాలు తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించింది.

 కేంద్ర ఆదేశాల మేరకే వాహన చట్టం అమలు

కేంద్ర ఆదేశాల మేరకే వాహన చట్టం అమలు

కేంద్రం కొత్త మోటార్ వాహన చట్టం విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మరో 20 సెక్షన్లలో కూడా జరిమానాలు తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు కల్పించాలని కోరాయి. దీనిపై కేంద్ర సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సూచనలు చేయాల్సిందిగా పేర్కొంది. సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ కేంద్రం సవరించిన చట్టాన్ని అమలు చేయాలని, ప్రమాదాలను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. దీంతో కొత్త మోటార్ వాహన చట్టంలో రాష్ట్రం ప్రతిపాదించిన 20 సెక్షన్లలో జరిమానాను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఇవ్వడం సాధ్యం కాదని, సడలింపులు ఉండబోవని కేంద్రం తేల్చిచెప్పింది.

ఏపీలో కొత్త వాహన చట్టం అమలుకు రంగం సిద్ధం

ఏపీలో కొత్త వాహన చట్టం అమలుకు రంగం సిద్ధం

దీంతో అన్ని రాష్ట్రాలు కేంద్రం అమలులోకి తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టాన్ని ఆయా రాష్ట్రాలలో అమలు చెయ్యాల్సిందే అని స్పష్టమైంది . ఈ నేపథ్యంలో తాజా సవరణలకు తగ్గట్టుగా ఏపీలో కొత్త మోటారు వాహన చట్టం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై ఉక్కు పాదం మోపడానికి సిద్ధమైన ఏపీ సర్కార్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జైలుకే అని గతంలోనే పేర్కొంది. ఇప్పుడు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా సరే కఠిన చర్యలే అంటుంది.

 రెడీ అయిన రవాణా శాఖ ... త్వరలోనే నోటిఫికేషన్

రెడీ అయిన రవాణా శాఖ ... త్వరలోనే నోటిఫికేషన్

ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రవాణాశాఖ ప్రభుత్వానికి పంపించగా, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర పడిన వెంటనే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వాహనచోదకులు ఎటువంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా జేబులు గుల్ల చేసుకోవాల్సిందే. అంతేకాదు జైలు శిక్షలు, డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు తదితర చర్యలకు ఏమాత్రం వెనుకాడేది లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

English summary
 ap government taking steps to check the traffic rules violation . Most people drive vehicles without a helmet. AP govt gives shock to motorists in AP who are neglecting to wear helmets . they will get fined 1000 rupees and three months their license cancelled .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X