వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి ట్రెజరీలకు....ఎట్టకేలకు మళ్లీ డబ్బు కళ

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీలకు మళ్లీ డబ్బు కళ వచ్చిందట. ఈ విషయం తెలిసి ఉద్యోగులు హమ్మయ్య అంటూ సంబరపడుతున్నారు.గత మూడు నెలలుగా జీతం తప్ప మరే బిల్లు ఇవ్వని ట్రెజరీలు ఇక తమ పట్ల కరుణ చూపుతాయని ఉద్యోగులు ఆశపడుతున్నారు.

గడచిన మూడునెలలుగా ఉద్యోగుల జీతాల చెల్లింపే తప్ప మరో బిల్లు ఊసే ఎత్తని సబ్‌ ట్రెజరీల పరిస్థితిలో ఇక ముందు మార్పు వస్తుందట. కారణం ఎపి ప్రభుత్వం ట్రెజరీలకు నిధులు విడుదల చేసిందట. ఇన్ని రోజులుగా కేవలం జీతాల చెల్లింపులకే పరిమితమైన సబ్ ట్రెజరీలు ఇక ముందు ఉద్యోగులకు సంబంధించి వివిధ శాంక్షన్లకు సన్నద్దమవుతున్నట్లు తెలిసింది.

AP Treasuries .... again gain money

మొన్నటివరకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నందున ట్రెజరీల నుంచి జీతాల వరకే చెల్లింపులు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత మేర మెరుగైందట. మరో నాలుగు రోజుల్లో క్రిస్మస్‌ పండుగ కూడా ఉండడంతో ఉద్యోగులకు పండుగ అడ్వాన్సులు చెల్లించేందుకు ట్రెజరీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

English summary
Andhra Pradesh Treasuries again got the money. Employees who have not given any bill other than salary for the past three months are happy to listen this news. The reason behind this was that the AP government has released funds to the Treasuries. Since the financial condition of the government is very difficult from past 3 months, other than salaries no payments have been paid from treasuries . Now the financial situation of the state has improved somewhat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X