హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుతో వాల్‌మార్ట్, మహిళలకు చేయూత(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీలోని స్వయం సహాయక బృందాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో తోడ్పాటునందిస్తామని వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు డేవిడ్ ఛీజ్ రైట్ తెలిపారు. బుధవారమిక్కడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు.

స్ధానిక రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను సేకరించడంలో, ఉత్పాదకత పెంచడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని డేవిడ్ ఛీజ్ రైట్ తెలిపారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి టి విజయకుమార్‌, వాల్‌మార్ట్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌తో కలిసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

ప్రస్తుతం వాల్‌మార్ట్‌ ద్వారా జీడిపప్పు, మిర్చి, కొబ్బరి, బత్తాయిలు తదితర ఉత్పత్తులను రాష్ట్రంలో సేకరిస్తున్నారని, వీటికి అదనంగా పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కూడా కొనుగోలు చేసే అంశంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

 బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

ఏపీలో అన్ని రకాలుగా వాల్ మార్ట్‌కు ప్రభుత్వం సహకరిస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం జిల్లాలో పండే వివిధ రకాల పండ్లకు గిరాకీ అధికంగా ఉందని, హార్టికల్చర్‌ హబ్‌గా ఎదిగే సామర్థ్యం ఆ జిల్లాకు ఉన్నాయని చంద్రబాబు వాల్‌మార్ట్‌ ప్రతినిధులకు వివరించారు.

 బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

బాబుతో వాల్‌మార్ట్ అధ్యక్షుడు డేవిడ్ భేటీ

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్‌, వాల్‌మార్ట్‌ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 బాబుతో యొకోహమా నగర కౌన్సిల్ అధికారులు భేటీ

బాబుతో యొకోహమా నగర కౌన్సిల్ అధికారులు భేటీ

అనంతరం చంద్రబాబుతో జపాన్‌కు చెందిన యొకోహమా నగర కౌన్సిల్ అధికారులు కూడా బుధవారం ఆయన్ని సచివాలయంలో కలిశారు. కాకినాడను ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్న సీఎం విజ్ఞప్తిపై వారు సానుకూలంగా స్పందించారు.

 బాబుతో యొకోహమా నగర కౌన్సిల్ అధికారులు భేటీ

బాబుతో యొకోహమా నగర కౌన్సిల్ అధికారులు భేటీ

ఈ సమావేశంలో కాకినాడ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్ వేర్ పార్కు అభివృద్ధికి జపాన్ తోడ్పాటు అందించాలని చంద్రబాబు వారిని కోరారు.

English summary
The Andhra Pradesh government and global retail major Walmart International have formed a task force to collaborate on sourcing of various agriculture commodities by the company in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X