గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ అడుగు పెడితే ఏపి అప‌విత్రం అవుతుంది.!చీక‌టి దినంగా పాటించాల‌ని పార్టీ శ్రేణుల‌కు బాబు పిలుపు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఢిల్లీలో ధర్మపోరాట దీక్షను నిర్వీర్యం చేయ‌డానికే ప్రధాని మోడీ ఏపీ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్ర‌బాబు మోదీ ఏపి ప‌ర్య‌ట‌న గురించి ప్ర‌స్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఢిల్లీలో టీడిపి చేస్తున్న ధర్మపోరాట దీక్ష దేశానికే దిక్సూచి అని చెప్పారు. రాష్ట్ర అభివ్రుద్ది కోసం, భావి త‌రాల భ‌విష్య‌త్తు కోసం ఈ పోరాటం చేస్తున్నామన్నారు. టీడీపీ చేస్తున్న ఈ పోరాటానికి అందరి సంఘీభావం ఉందన్నారు. ఢిల్లీలో దీక్షకు మద్దతుగా రాష్ట్రంలో కూడా దీక్షలు చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాల మద్దతు తీసుకుని ప్రతి ఒక్కరూ నిరసనల్లో పాల్గొనాలని సూచించారు.

AP will polute with Modis entry..! Babu called the cadre to celebrate as Dark Day..!!

ప్రధాని మోడీ గుంటూరు పర్యటన సందర్భంగా నిరసన దినంగా పాటించాలని ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఒక దుర్దినమని, చీకటి దినమని సీయం అభివ‌ర్ణించారు. పుండు మీద కారం చల్లడానికే మోడీ వస్తున్నారని, చేసిన దుర్మార్గం చూసేందుకు ఆయన వస్తుంటే ఇక్కడున్న దుర్మార్గుడు సహకరిస్తున్నాడని ప‌రోక్షంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పై మండిప‌డ్డారు. మోదీ ప్రభుత్వాలను అస్ధిర పరుస్తున్నారని, నాయకత్వాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాఫెల్ బురదలో మోడీ కూరుకు పోయారని, ఈ వ్యవహారంలో పీఎంఓ జోక్యం చేసుకుని దేశానికి అప్రదిష్ట తెచ్చారని చెప్పారు. మోడీ అడుగులు ఆంధ్రప్రదేశ్ ను అపవిత్రం చేస్తాయన్నారు. టీడీపీ శ్రేణులంతా పసుపు చొక్కాలు, నల్ల చొక్కాలతో నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. అలాగే పసుపు బెలూన్లు, నల్ల బెలూన్లు ఎగరవేసి నిరసన ప్రకటించాలని సూచించారు.

English summary
Chief Minister Chandrababu Naidu called on the TDP cadre to be observed as a protest day during Prime Minister Modi's visit to Guntur. The cm chandra babu described as a day of darkness and a dark day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X