వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ టీంలో భేష్ అనిపించుకున్న మంత్రి ...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

108 కి ఆలస్యమవడం తో తన కారులో వెళ్ళమన్న మంత్రి || Anil Yadav Directed His Driver | Oneindia Telugu

జగన్ మంత్రి వర్గంలో ఓ యువమంత్రి భేష్ అనిపించుకున్నారు....ప్రాణపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు నేరుగా కాన్వాయ్‌లోని కారునే తీసుకెళ్లాలని చెప్పాడు....ఇంతలో 108 రావడంతో ప్రమాద భాధితులను దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు.. దీంతో యువమంత్రి చేసిన సహాయానికి పలువురు నుండి ప్రశంశలు అందుకుంటున్నారు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతిలో సోమవారం జరిగిన ఓ సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుండి బయలు దేరాడు... అయితే మంత్రి వెళ్తున్న దారిలోనే ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ప్రమాదాన్ని గమనించిన మంత్రి వెంటనే స్పందించారు. తన కాన్వాయ్‌ని ఆపి సహాయం చేసేందుకు బాధితుల వద్దకు వెళ్లారు. ఆయన సంఘటన స్థలానికి వెళ్లేసరికి గాయాలపాలైన వారి పరిస్థితి విషమంగా ఉంది.... బాధితులను ఆసుపత్రికి తరలించేందుకు 108 కోసం అంతా వేచి చూస్తున్నారు. అయితే అప్పటికే 108కి కాల్ చేసినా ఆలస్యం అవుతుండడంతో...గాయపడిన పడినవారిని వెంటనే తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాలని మంత్రి తన డ్రైవర్‌ను ఆదేశించాడు.

AP young minister anil yadav responded actively in a incident

ఇక మంత్రి ఆదేశాలు పాటించేలోపే.... 108 సైతం అక్కడికి చేరుకుంది. వెంటనే క్షతాగాత్రులకు ప్రాధమిక చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. అయితే మంత్రి అనిల్ యాదవ్ మాత్రం వారికి ప్రాధమిక చికిత్స అందించే వరకు అక్కడే ఉండి...తన అనుచరులతో కలిసి వారిని ఆసుపత్రికి తరలించారు. దీంతో మంత్రిపై ప్రశంశల జల్లు కురుస్తుంది. సాధరణంగా బిజీ షెడ్యుల్‌లో ఉండే మంత్రులు ప్రమాద సంఘటనవద్దకు వెళ్లడమే అరుదుగా ఉంటుంది. ..కాని మంత్రి అనిల్ యాదవ్ మాత్రం ప్రమాద బాధితుల వద్దకు వెళ్లడమే కాకుండా వారికి దగ్గరుండి సహాయం అందించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి పలు ప్రశంశలు అందుకుంటున్నారు మంత్రి.

English summary
AP young minister anil yadav responded actively in a incident.when he saw a accident on his way, he went to close the victims and directed his driver to take the hospitals ih his vehcle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X