వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ మంటలు: టీకాలను ముందే ఎలా వాడేస్తారు: జగన్‌పై సోము నిప్పులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ మండిపడుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 13 లక్షల మందికి పైగా వేయడానికి అవసరమైన వ్యాక్సిన్లను రాష్ట్రానికి సరఫరా చేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వమేనని గుర్తు చేస్తోంది. వ్యాక్సిన్లను అందించింది తామే అయినప్పటికీ.. వైసీపీ ప్రచారం చేసుకుంటోందని మండిపడుతోంది. ఇది కాస్తా వైసీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెర తీసినట్టయింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో వైఎస్ జగన్ వక్రబుద్ధిని ప్రదర్శించారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వ్యాక్సిన్లను కేంద్రం పంపించిందనే విషయాన్ని విస్మరించారని ఆరోపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ రోజున వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం 9.56 లక్షల డోసుల టీకాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తే.. దాన్ని ముందే వాడేశారని ధ్వజమెత్తారు. యోగా దినోత్సవం నాటికి బదులుగా ముందే స్పెషల్ డ్రైవ్ పెట్టారని అన్నారు. నిర్దేశిత సమయం కంటే ముందే ఎలా వాడేస్తారని ప్రశ్నించారు.

APBJP Chief Somu Veerraju says vaccines were provided by the Centre for special drive to State

స్పెషల్ డ్రైవ్ సందర్భంగా యువతకు ఎందుకు వ్యాక్సిన్లు వేయలేదని సోము వీర్రాజు నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకుని తామేదో ఘనకార్యం సాధించినట్లు జగన్ సర్కార్ ప్రచారం చేసుకుంటోందని ఆయన అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు తాము పలు వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించామని, ఎక్కడికెళ్లినా టీకాలు లేవనే సమాధానమే వినిపించిందని అన్నారు. ఒక్కరోజు ముందే ఆదివారం నాడే ఎక్కువ టీకాలను వేసినట్లు సిబ్బంది తమకు చెప్పారని అన్నారు.

ఈ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు, మాటలను వైఎస్ జగన్ ధిక్కరించినట్టయిందని సోము వీర్రాజు ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. పైగా దేశంలో అందరికంటే తామే ఒక్కరోజులో 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పుకుంటోందని, జగన్ వక్రబుద్ధికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఒక్క చోట కూడా ప్రధాని మోడీ ఫొటో లేదని, అన్ని కేంద్రాల్లోనూ జగన్ చిత్రాలే కనిపించాయంటూ మండిపడ్డారు. 18 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలంటూ మోడీ చేసిన సూచలనను సైతం జగన్ పట్టించుకోలేదని, ఇది ఆయన ధిక్కార ధోరణికి నిదర్శనమని అన్నారు.

English summary
BJP Andhra Pradesh unit Chief Somu Veerraju says vaccines were provided by the Centre for special drive to State. YS Jagan Government claims that the vaccinated over 13.72 lakh people in single day on June 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X