అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ భ‌రోసా యాత్ర : 22న యాత్ర‌లో రాహుల్ : 27న ప్రియాంక హాజ‌రు

|
Google Oneindia TeluguNews

ఏపిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ముందు తిరిగి ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు కొత్త యాత్ర చేప‌ట్టింది. 2014 ఎన్నిక‌ల్లో ఊహించ‌ని ప‌రాభ‌వం ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు ఏపికి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ భ‌రోసా యాత్రం ప్రారంభించింది. అనంత‌పురం ఇల్లా నుండి ప్రారంభ‌మైన ఈ యాత్ర‌లో ఈ నెల 22న రాహుల్ గాంధీ పాల్గొంటారు.

భ‌రోసా యాత్ర ప్రారంభం..
ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భరోసా యాత్ర ప్రారంభమైంది. అనంత‌పురం జిల్లాలోని మడకశిరలోని నీలకంఠాపురంలో కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, డీకే శివకుమార్‌, ఊమన్‌ చాందీ ఈ బస్సు యాత్రను ప్రారం భించారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈ యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు.

మార్చి 3వ తేదీ వరకు 2251 కిలో మీటర్లు జరిగే ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేతలు, జాతీయ స్థాయి నాయకులు, స్టార్ క్యాంపెయి నర్‌లు పాల్గొంటారు. ఈనెల 22న తిరుపతిలో జరిగే యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. అలాగే 27వ తేదీ యాత్రలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొంటారని రఘువీరా యాత్ర ప్రా రంభంలో ప్ర‌క‌టించారు.

APCC Bharosa Yatra Start : Rahul Participate onn 22nd this month

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌..
ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తం 25 లోక్‌స‌భ‌..17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు ఇప్ప‌టికే డిసిసి లు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాయి. ఈ నెలాఖ‌రు లోగా వీటిని స్క్రూటినీ చేసిన పిసిపి నేరుగా ఏఐసిపికి పంప‌నుంది. మార్చి మొద‌టి వారంలోనే అభ్య‌ర్దుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

ఏపి లో బిజెపి పై తీవ్ర స్థాయిలో ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉండ‌టంతో..ప్ర‌త్యేక హోదా పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మ‌రో సారి తిరుప‌తి కేంద్రంగా హామీ ఇస్తే త‌మ‌కు ఏపిలో తిరిగి నిల‌దొక్కుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కాంగ్రెస్ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. తిరుప‌తిలోనే ప్ర‌ధాని మోదీ నాడు ఏపికి హోదా పై హామీ ఇవ్వ‌టంతో..ఇప్పుడు తిరిగి మోదీ చేసిన మోసాన్ని వివ‌రించి..అక్క‌డ నుండే రాహుల్ తో హామీ ఇప్పించాల‌ని కాంగ్రెస్ నేత‌లు నిర్ణ‌యించారు.

English summary
AP Congress party Started Hoda Bharos yatra from Anantapur dist. It continues upto march 3rd. AICC chief Rahul Gandhi participate in this yatra on 22nd of this month. Priyanka participate on 27th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X