వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టిసీమకు వ్యతిరేకం: నీళ్లివ్వకుంటే తలలు ఎక్కడ పెట్టుకుంటారన్న రఘవీరా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుకు కాంగ్రెస్ వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు, తెలుగుదేశం, బీజేపీ వ్యతిరేకమన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పట్టిసీమ ప్రత్యామ్నాయమని, 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ ఎందుకో సీఎం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

APCC Chief Raghuveera Reddy Fires on AP CM over polavaram project

వచ్చే నెలలోపు పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వకుంటే తెలుగుదేశం నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. టీడీపీ బతుకే ఇంకుడుగుతం బతుకు, సీఎం చంద్రబాబు జాతకం కుడా ఇంకుడు గుంతేనని అన్నారు.

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య, చంద్రబాబు నేరస్థులని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారిపై ఈ నెల 7,8,9 తేదీల్లో అన్ని పోలీస్‌స్టేషన్‌లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ఫిర్యాదులు చేస్తారని రఘవీరా చెప్పారు.

English summary
APCC Chief Raghuveera Reddy Fires on AP CM over polavaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X