వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు ఓటేసి అసెంబ్లీకి వెళ్లమంటే వెళ్లట్లేదు...మళ్లీ వాళ్లకి ఓట్లు ఎందుకు?:ఏపీసీసీ అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

అనంతపురం:ప్రజలు వాళ్లకి ఓటేసి అసెంబ్లీకి వెళ్లమంటే వెళ్లటం లేదు. అలా వెళ్లకుండా ఉండటానికి మరోసారి వాళ్లకి ఓట్లెందుకు వేయాలి?...అని ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఉద్దేశించి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు.

ఆదివారం ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో నియోజకవర్గ, బూత్‌ స్థాయి కమిటీలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ముస్లిం మైనార్టీ మంత్రి లేకపోవడం బాధాకరమని...అయితే ఈ విషయాన్ని ప్రశ్నించలేని ప్రతిపక్షం చేతగానిదిగా మిగిలిందని దుయ్యబట్టారు. విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని రఘువీరా పునరుద్ఘాటించారు.

APCC President Raghuveera Reddy Fire On Opposition Party YCP

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను రఘువీరా రెడ్డి ఆ సందర్భంగా వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతులందరికీ రూ. 2 లక్షలు రుణమాఫీతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని చెప్పారు. ఎపిలో కాంగ్రెస్ కు సుస్థిరమైన ఓటు బ్యాంకు రఘువీరారెడ్డి
చెప్పారు. గత మూలాలను వెతికితే దేశంలోని ప్రతి ఇల్లు కాంగ్రెస్‌ కుటుంబానిదే అన్నారు. అక్టోబర్‌ 2 నుంచి ఇంటింటా కాంగ్రెస్‌ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 44 వేల బూత్‌ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు.

ఇంటింటికి కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూత్‌ కమిటీ సభ్యులు గ్రామాలు పట్టణాలలోని ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌ ఔనత్యాన్ని, దేశానికి చేసిన సేవలను వివరించాలని రఘువీరా రెడ్డి చెప్పారు. 150 గాంధీ జయంతి వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త, బూత్‌ కమిటీ సభ్యుడు రాబోయే ఎన్నికల్లో రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు నిరంతరం కృషిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీని కాంగ్రెస్ మట్టి కరిపిస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందనే భయంతోనే తమ పార్టీ నాయకులపై కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ నాయకులను భయపెట్టడానికి టీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణాలో వందకు వంద శాతం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

గవర్నర్ గారూ!..వినతిపత్రం ఇద్దామంటే...అమరావతికి రారెందుకు?

English summary
Ananthapuram:APCC Chief Raghuveera Reddy criticized YCP leaders for not going to the Assembly. Raghuveera questioned why people should vote for them again?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X