విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డిపై ఆదివారం కోన గ్రామస్తులు రాళ్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాళ్ల దాడి వెనుకు కృష్ణా జిల్లా టీడీపీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రఘవీరారెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తన దూకుడుని పెంచారు. రఘవీరారెడ్డి దూకుడుని తగ్గించాలనే క్రమంలోనే బందరు పోర్టు కోసం ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటీసులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతు పలికేందుకు వచ్చిన రఘవీరాపై రాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి, దానికి ఎలాంటి కార్యాచరణ చేయనటువంటి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లపై కేసులు నమోదును ఒక ఉద్యమంలా చేపట్టారు. ఆ దిశగా విజయం సాధించారు కూడా.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

ఇలా వినూత్న కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీని ప్రజలకు మరింతగా చేరువయ్యేలా రఘవీరారెడ్డి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం బందర్ పోర్టు భూసమీకరణకు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్న క్రమంలో వారికి మద్దతు తెలిపేందుకు వచ్చారు.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

ఈ క్రమంలో కోన గ్రామ సెంటర్‌లో ఆయన మాట్లాడుతుండగా గ్రామస్తులు గొడవకు దిగారు. రఘువీరాపై ఇసుక ఎత్తి పోశారు. కంకర రాళ్లు రువ్వారు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు రఘువీరా చుట్టూ వలయంగా ఏర్పడి ఇసుక, రాళ్ళ దాడి నుంచి కాపాడే ప్రయత్నం చేశారు.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

దీంతో కోన గ్రామస్తులను అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులపై కొందరు యువకులు తిరగబడ్డారు. ఈ క్రమంలో యువకులు, పోలీసుల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీ చార్జీ చేసిన పరిస్ధితి అదుపులోకి రాకపోవడతో రఘవీరారెడ్డితో పాటు అక్కడి వచ్చిన కాంగ్రెస్ నేతలు గ్రామం నుంచి వచ్చేశారు.

 కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

అనంతరం రఘవీరా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ‘‘టీడీపీకి జరిగిన పరాభవాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నేతలు కాంగ్రెస్‌ సభ సజావుగా జరగకూడదనే ఉద్దేశంతో గ్రామానికి చెందిన కొందరు యువకులను మాపై ఉసి కొల్పారు'' అని అన్నారు. రెండు పంటలు పండే భూములను ప్రభుత్వం భూసేకరణ ద్వారా లాక్కుంటుందని ఆయన పేర్కొన్నారు.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

భూసేకరణ జరిగితే రైతులకు మార్కెట్‌ ధర కంటే నాలుగు రెట్లు చెల్లించాల్సి ఉందన్నారు. దీని ప్రకారం బందరులో పోర్టు, పరిశ్రమల కోసం 32 వేల ఎకరాలు సేకరించాలని చూస్తున్న ప్రభుత్వం, అందుకు మూడు లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

కోన గ్రామంలో రఘువీరాపై రాళ్లదాడి: టీడీపీ నేతల హస్తం ఉందా?

రైతులు ఐక్యతగా ఉంటే భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) జరగదని సూచించారు. ‘‘భూ సేకరణపై నూటికి నూరుశాతం రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. సెంటు భూమి కూడా తీసుకునే అవకాశం లేదు. రైతులంతా ధైర్యంగా ఉండవచ్చు'' అని అన్నారు.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలుచుకోలేదు. ఆ తర్వాత ఏపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రఘవీరా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అందులో భాగంగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అనంతపురం పర్యటనకు వచ్చేలా ఒప్పించారు. రాహుల్ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీని మరింతగా దగ్గరకు చేర్చేలా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.

English summary
APCC President N Raghuveera Reddy incurred the wrath of villagers, when he went to Kona village when they throw stones and sand at him opposing his visit.The APCC President along with other Congress party leaders, including KDCC President K Bucchibabu went to Kona village near Krishna district head quarters of Machilipatnam town on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X