హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిన్నమనేనిని కాపాడిన సీట్ బెల్ట్: ఔటర్ ప్రమాదంపై బాబు దిగ్భ్రాంతి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుదంపతులు ప్రయాణం చేస్తున్న కారు సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ రింగ్ రోడ్డులో పహాడీ షరీఫ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి (55), కారు డ్రైవర్ దాస్ అక్కడికక్కడే మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావును అపోలో ఆస్పత్రికి తరలించారు.

పల్టీలు కొట్టిన కారు: పిన్నమనేనిని కాపాడిన సీటు బెల్ట్

ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని దంపతులు ప్రయాణం చేస్తున్న కారు వేగంగా రావడం వల్ల ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని మూడు పల్టీలు కొట్టింది. సీటు బెల్టు ధరించక పోవడం వల్లే పిన్నమనేని భార్య, డ్రైవర్ మరణించినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం పిన్నమనేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. పిన్నమనేని భార్య, కారు డ్రైవర్‌కు గాంధీ ఆస్పత్రిలో శవ పరీక్షలు నిర్వహించారు. బుధవారం కృష్ణాజిల్లాలోని వారి స్వస్థలంలోనే అంత్యక్రియలు జరుగుతాయి.

కారు డ్రైవర్ మృతదేహం

కారు డ్రైవర్ మృతదేహం

ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావుదంపతులు ప్రయాణం చేస్తున్న కారు సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ రింగ్ రోడ్డులో పహాడీ షరీఫ్ వద్ద ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

పిన్నమనేని సతీమణి మృతదేహం

పిన్నమనేని సతీమణి మృతదేహం

ఈ ప్రమాదంలో పిన్నమనేని సతీమణి సత్యవాణి (55), కారు డ్రైవర్ దాస్ అక్కడికక్కడే మరణించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వెంకటేశ్వరరావును అపోలో ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గురైన కారు

ప్రమాదానికి గురైన కారు

సీటు బెల్ట్ పెట్టుకున్న కారణంగానే ముందు సీటులు కూర్చున్నప్పటికీ పిన్నమనేని వెంకటేశ్వర రావు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, అతివేగమే కారణమని అధికారులు వెల్లడించారు.

రక్తపు మడుగులో

రక్తపు మడుగులో

ఈ ప్రమాద ఘటనతో పిన్నమనేని స్వస్థలం కృష్ణా జిల్లా నందివాడ మండలం రుద్రపాక గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. సత్యవాణి మృతదేహాన్ని రోడ్డు మార్గాన స్వగ్రామానికి తరలించారు.

ప్రమాద స్థలి

ప్రమాద స్థలి

వెంకటేశ్వరరావు బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరానికి చేరుకోనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదానికి గురైన కారు

ప్రమాదానికి గురైన కారు

పిన్నమనేని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. డ్రైవర్ కుటుంబ సభ్యులకు కూడా సిఎం సంతాపం తెలిపారు.

ఆస్పత్రిలో పిన్నమనేని

ఆస్పత్రిలో పిన్నమనేని

హైదరాబాద్‌లోనే ఉంటున్న పిన్నమనేని విజయవాడలో సమీప బంధువు ఇంట జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం భార్యతో కలిసి వచ్చారు. సోమవారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు.

ఆస్పత్రిలో పిన్నమనేని

ఆస్పత్రిలో పిన్నమనేని

కారులో పిన్నమనేని ఒక్కరే సీటు బెల్ట్ ధరించి ఉన్నారని, ప్రమాద సమయంలో ఎయిర్ బ్యాగ్ కారణంగా ప్రాణాలతో బయటపడ్డారని చెబుతున్నారు. ఆప్కాబ్ సంస్థ దాదాపు రూ.35 లక్షలతో ఇటీవల ఆ కారును కొనుగోలు చేసిందని, డ్రైవర్ ఆ సంస్థ ఉద్యోగి అని తెలుస్తోంది.

English summary
APCOB Chairman and former Minister Pinnamaneni Venkateshwara Rao’s wife and his driver died while he escaped with minor injuries when the car they were travelling in overturned while reportedly being driven at high speed on Outer Ring Road here on Monday midnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X