వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసక్తికరం: కేసీఆర్ ఇచ్చిన బొకేలోని గులాబీని బాబుకిచ్చిన ఉమాభారతి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు కృష్ణా జలాల పంపిణీపై అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఉమాభారతి వద్దకు వెళ్లిన సమయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి అభివందనం చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీలతో కూడిన పుష్పగుచ్ఛాన్ని ఆమెకు ఇచ్చారు. చిరునవ్వుతో దానిని తీసుకున్న ఉమాభారతి, అప్పటికే అక్కడికి చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబును కేసీఆర్‌కు చూపించారు.

apex council meeting started at new delhi

దీంతో ఇద్దరు చంద్రులు కరచాలనం చేసుకున్నారు. వెంటనే కేసీఆర్ తనకు ఇచ్చిన గులాబీ బొకే నుంచి ఓ పువ్వును లాగి ఆమె చంద్రబాబుకు ఇచ్చారు. ఆ తర్వాత మరో పువ్వును తీసి కేసీఆర్‌కు ఇచ్చారు. ఈ సంఘటనను అక్కడున్న ఇరు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖ మంత్రులు దేవినేని ఉమా, హరీశ్ రావులతో పాటు అధికారులు చిరునవ్వుతో తిలకించారు.

ఇదిలా ఉంటే కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు ఇరు రాష్ర్టాల నీటి పారుదల శాఖ మంత్రులు, ఇంజినీర్లు హాజరయ్యారు.

బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలు సరిగ్గా 2 గంటలకు సమావేశమయ్యారు. కృష్ణా నదీ జలాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ర్టాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాయి.

ఈ ప్రజెంటేషన్‌లో బచావత్ ట్రిబ్యునల్ గతంలో చేసిన నీటి కేటాయింపులు, నదిపై నిర్మించిన ప్రాజెక్టులు, తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు, నీటి పంపిణీ, వినియోగానికి సంబంధించిన వివాదాలు, ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన రెండు రాష్ట్రాలు నీటిని పంపిణీ చేసుకుంటున్న విధానం తదితరాలన్నింటినీ వివరిస్తున్నారు.

* 2.55 గంటల నుంచి 3.10 వరకు ఏపీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్
* 3.10 గంటల నుంచి 3.25 వరకు తెలంగాణ ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్
* 3.25 నుంచి 4.10 వరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం రూపొందించిన ఎజెండాపై చర్చ.
* 4.10 నుంచి 4.20 వరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పీచ్
* 4.20 నుంచి 4.30 వరకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పీచ్
* 4.30 నుంచి 4.40 వరకు కేంద్ర మంత్రి ఉమాభారతి మాట్లాడతారు.

మొత్తంగా ఐదు గంటలకల్లా సమావేశాన్ని పూర్తిచేసేలా షెడ్యూల్ ఖరారైంది.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao on Tuesday left for New Dehli where he is scheduled to attend a meeting of apex council on river water sharing between Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X