అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్..చంద్రబాబు మిస్సయ్యారు..రోజాకు చాన్స్ దక్కింది: అధికారిక హోదాలో తొలిసారి..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రిగా జగన్ ఆ అవకాశం కోల్పోయారు. సంబంధిత మంత్రి సైతం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కానీ, వైసీపీ ఫైర్ బ్రాండ్ ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా మాత్రం ఆ చాన్స్ మిస్ కాలేదు. తనకున్న హోదాతో ఆ కార్యక్రమంలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా నిలిచారు. అనంతపురం జిల్లాలో పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును మంత్రులు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా మార్కెట్లోకి విడుదల చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. సీఎం జగన్‌ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ సంస్థ ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

తాజా ..మాజీ సీఎంలు ఛాన్స్ మిస్..

తాజా ..మాజీ సీఎంలు ఛాన్స్ మిస్..

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో ఏపీలో ఈ ఫ్యాక్టరీకి శంఖుస్థాపన జరిగింది. తాను ఎంతో కష్టపడి ఈ ఫ్యాక్టరీని ఏపీకి తెప్పించేందుకు కష్టపడ్డానని చంద్రబాబు పలు మార్లు చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రధాని మోదీ చొరవతోనే కియా సంస్థ ఏపీలో యూనిట్ ప్రారంభించిందనే వాదన బీజేపీ నేతలు చేసారు. అయితే, అనూహ్యంగా కియా సంస్థ తమ తొలి కారును మార్కెట్లోకి విడుదల చేసే సమ యానికి ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత సభలో ప్రభుత్వం ఒక లేఖను బయట పెట్టింది. 2007లో నాడు సీఎంగా ఉన్న వైయస్సార్ అభ్యర్ధన మేరకే కియా సంస్థ ఏపీలో యూనిట్ ప్రారంభించిందని అందులో పేర్కొన్నారు. ఇక, ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా.. ఆయన ఢిల్లీ పర్యటన.. గోదావరి వరద ముంపు ప్రాంతాల పర్యటనతో కియా సంస్థ కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన లేకపోయారు. అదే సమయంలో చంద్రబాబుకు ఆహ్వానం లేకపోవటం పైన టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేసారు.

పరిశ్రమల మంత్రి మిస్..ప్రతినిధిగా రోజా

పరిశ్రమల మంత్రి మిస్..ప్రతినిధిగా రోజా


ముఖ్యమంత్రి గైర్హాజరయ్యారు. సంబంధిత శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో..ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ హోదాలో రోజా హాజరయ్యారు. కారు ఆవిష్కరణ తరువాత కియా సంస్థకు అభినందనలు తెలుపుతూ కారు మీద శుభాకాంక్షల మెసేజ్ రాసారు. కార్యక్రమంలో మొత్తంగా చాలా హ్యాపీగా కనిపించారు. ఆ తరువాత ప్రసంగిస్తూ ప్రభుత్వ సందేశాన్ని అందించారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఏపీలో పారిశ్రామికంగా డెవలప్ మెంట్ కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా సీఎం వైఎస్‌ జగన్‌ చట్టం చేశారని గుర్తుచేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొదిస్తామని చెప్పారు. దీని ద్వారా మంత్రిగా పదవి రాకపోయినా.. తనకు ఉన్న హోదాతో రోజా ఈ కార్యక్రమంలో పాల్గొని తన హోదాతో ఎంజాయ్ చేసారు.

అక్కడా లోకేశ్ ను వదల్లేదుగా..

అక్కడా లోకేశ్ ను వదల్లేదుగా..

కొద్ది రోజులుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వైసీపీ ప్రభుత్వం మీద..ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నుండి ఏ ఒక్కరూ స్పందించటం లేదు. కియా కారు ఆవిష్కరణ తరువాత రోజా దీని పైన స్పందించారు. లోకేశ్ మీద ఫైర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నారా లోకేశ్‌కు మతి భ్రమించిందని రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో చంద్రబాబు, లోకేశ్‌లు యువతను మోసం చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీపీకి లేదన్నారు. ఇక, ఏపీ ప్రభుత్వం విజయవాడలో నిర్వహిస్తున్న రాయబారుల సదస్సులో సైతం రోజా పాల్గొంటున్నారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ హోదాలో ప్రభుత్వం పెట్టుబడుల కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సులో కీలకంగా వ్యవహరించనున్నారు.

English summary
APIIC Chair person Roja Became Centre of attraction in KIA Car launching programme. CM Jagan and Ex Cm Chandra babu did not attend the programme.Roja played crucial role in this inaguration programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X