హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉమ్మడైతే కేజ్రివాల్ పరిస్థితే: ధర్నాలో అశోక్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విభజన బిల్లులో పేర్కొన్న ఉమ్మడి రాజధాని ఏర్పాటైతే ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఎదుర్కొంటున్న పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌కీ వస్తుందని ఏపిఎన్జివోల అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. ఉమ్మడి రాజధాని రాజులేని రాజ్యం వంటిదని ఆయన అన్నారు.

సమైక్య ఉద్యమం మలిదశలో కొనసాగుతున్న సమయంలో సీమాంద్ర రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం శుభసూచకమని అశోక్ బాబు అన్నారు. కాగా ధర్నా చేస్తున్న సమైక్యవాదులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యడు లగడపాటి రాజగోపాల్‌ను వేదికపై నుంచి తెలంగాణవాది ఒకరు కిందికి లాగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

అనంతరం లగడపాటి మాట్లాడుతూ.. ఇటువంటి దాడులు జరగడం సహజమేనని, తనకు ఏమీ కాలేదని, ఇలాంటి వాటికి భయపడేది లేదని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని అన్నారు. లగడపాటితోపాటు రాష్ట్ర మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు సిఎం రమేష్, పలువురు సీమాంధ్ర నేతలు ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఏపిఎన్జివో ఉద్యోగులు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

ధర్నా వేదిక

ధర్నా వేదిక

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. వేదికపై ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, పలువురు సీమాంధ్ర నేతలు.

సమైక్యవాదుల నినాదాలు

సమైక్యవాదుల నినాదాలు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న సమైక్యవాదులు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బందోబస్తు

బందోబస్తు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు.

కారులో గంటా

కారులో గంటా

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నా వేదిక వద్దకు కారులో వస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు.

కంచెతో ఇబ్బందులు

కంచెతో ఇబ్బందులు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు రహదారిపై ఇనుప కంచె ఏర్పాటు చేయడంతో అటువైపు వెళ్లే స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కంచె దాటేందుకు యత్నం

కంచె దాటేందుకు యత్నం

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను దాటేందుకు ప్రయత్నిస్తున్న యువతికి సహాయపడుతున్న ఓ పోలీసు.

లగడపాటి

లగడపాటి

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నా వేదిక వద్దకు చేరుకుంటున్న ఎంపి లగడపాటి రాజగోపాల్.

వేదికపై నేతలు

వేదికపై నేతలు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ధర్నా వేదికపై మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎంపి సుజనా చౌదరి, పాల్గొన్న సీమాంధ్ర నేతలు.

సమైక్యాంధ్ర బస్సు

సమైక్యాంధ్ర బస్సు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఇందిరా పార్క్ వద్ద జై సమైక్యాంధ్ర అని రాసివున్న బస్సు.

ఆంక్షలు

ఆంక్షలు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఏపిఎన్జీవోల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో అటువైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్రాఫిక్ మళ్లింపు

ట్రాఫిక్ మళ్లింపు

బుధవారం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక, ఏపిఎన్జీవోల ఆధ్వర్యంలో సమైక్యవాదులు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఏపిఎన్జీవోల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న పోలీసులు.

పోలీసులతో..

పోలీసులతో..

ఏపిఎన్జీవోల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను అక్కడే ఉన్న పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయాణికులు.

కాలికడకే

కాలికడకే

ఏపిఎన్జీవోల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో ఆ మార్గంలో ప్రయణించే వారు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇబ్బందులు

ఇబ్బందులు

ఏపిఎన్జీవోల అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. దీంతో ఆ మార్గంలో ప్రయణించే వారు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
APNGO's Challo Assembly Meeeting at Indira Park in Hyderabad on Wednesday. Ashok Babu said that they won't accept United Capital and State bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X