వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిలో వైయస్ విగ్రహాలపై దాడి: నేతలకు అశోక్ హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

APNGOs Ashok Babu warns Politicos of retaliation
హైదరాబాద్/ఖమ్మం/విజయనగరం: ఖమ్మం జిల్లా ఇల్లెందులో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పాతబస్టాండు వద్ద గల వైయస్ విగ్రహం ముఖాన్ని చెక్కారు. జగదాంబ సెంటర్లోని మరో విగ్రహం తలను తొలగించారు. విగ్రహం తల భాగంలోని ముఖ భాగాన్ని జగదాంబ సెంటర్లో ఉన్న తెలంగాణ తల్లి పాదాల ముందు పెట్టారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.

గురుద్వారపై దాడి

విజయనగరం జిల్లా కేంద్రం శివారు కెఎల్‌పురంలో ఉన్న గురుద్వారాపై సమైక్యవాదులు దాడి చేశారు. కొందరు విద్యార్థులను సిక్కులు శుక్రవారం రాత్రి కొట్టారనే కోపంతో ఉన్న సమైక్యవాదులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత గురుద్వారాపై దాడి చేశారు. అద్దాలను, లోపలున్న పలు గ్రంథాలను, విలువైన సామగ్రిని ధ్వంసం చేశారు.

ద్విచక్రవాహనం, సైకిల్‌కు నిప్పంటించినట్లు సిక్కులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ దాడిని ఖండిస్తూ హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ గురుద్వారా వద్ద సిక్కులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి మైనార్టీలైన సిక్కులకు రక్షణ కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు.

సమ్మె కొనసాగిస్తాం: అశోక్ బాబు

రాష్ట్రం సమైక్యం కోసం సమ్మె యధావిధిగా కొనసాగిస్తామని, ఈనెల 20వ తేదీ వరకు కార్యాచరణ రూపొందించామని ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాదులో స్పష్టం చేశారు. సమ్మె విషమయై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిపితే వెళతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేస్తామన్నారు. సమైక్యాంధ్రా కోసం విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

ఈనెల 8,9 తేదీల్లో బ్యాంకులు మూసివేత, 10 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యేలను కలుస్తామని, వారితో సమావేశం నిర్వహిస్తామని, సమైక్యాంధా కోసం కృషి చేస్తామని ఎమ్మెల్యేలు బహిరంగ హామీ ఇవ్వాలని కోరతామని అన్నారు. 13, 14 తేదీలు దసరా కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు ఉండవని అశోక్ బాబు తెలిపారు. 15న 13 జిల్లాల్లోని మండల స్థాయిలో అన్ని మండలాల్లో రైతుల కోసం ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. 16న ముస్లిం సోదరుల పండుగ బక్రీద్ కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు ఉండవని అన్నారు. 17 నుంచి 19 వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం చేస్తామని చెప్పారు. అలాగే 13 జిల్లాలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ సమ్మెకు సంఘీభావంగా వారిని కూడా ఉద్యమంలోకి రావాలని కోరతామని ఆయన అన్నారు.

అమలాపురం ఎంపి హర్ష కుమార్‌కు అశోక్ బాబు హెచ్చరిక చేశారు. ఎపిఎన్జీవో ఉద్యోగులపై దాడి చేసి కొట్టిన దానిపై క్షమాపణ చెబితే సరిపోదని, ఆయన కుమారులపై కిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హర్ష కుమార్ కుమారులపై సాధారణ కేసులు నమోదైందని, పోలీస్ స్టేషనన్ బెయిల్‌పై వెంటనే వచ్చేసినట్లు తెలిసిందని అన్నారు. రేపు ముఖ్యమంత్రిని కలిసి రాజమండ్రిలో జరిగిన దాడిపై ప్రత్యేక విచారణ జరపాలని కోరతామని తెలిపారు.

అలాగే విజయనగంలో కూడా ఉద్యోగులపై పోలీసులు అమానుషంగా దాడులు చేస్తున్నారని, అలాగైతే దాడులకు ప్రతిదాడులు చేసే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు మరోసారి ప్రజలను మోసం చేశారని అర్ధమైపోయిందని, రాజీనామాలు చేయకుండా ధిష్టానానికి తలవంచారని, వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాజకీయ నేతలు తమ ఉద్యమంలో పాల్గొనవద్దని, వేరేగా చేసుకోవాలని ఆయన సూచించారు.

English summary
The APNGOs president Ashok Babu on Sunday warned of retaliation against politicians who have been resorting to attacks against employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X