హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిపై అందింది: నారాయణస్వామి, అశోక్ బాబు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

APNGOs to go on flash stir over Telangana
యానాం/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి నివేదిక వచ్చిందని పుదుచ్చేరి పార్లమెంటు సభ్యులు, మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు నారాయణ స్వామి ఆదివారం తెలిపారు. హెలెన్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన యానాం ప్రాంతంలో ఆయన పర్యటించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివిధ అంశాలపై పూర్తిస్థాయి నివేదిక ఇచ్చారని తెలిపారు. వీటిలో ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి త్వరలో తమ నివేదికను సమర్పిస్తామని చెప్పారు.

విభజన విషయంలో జివోఎంలో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్నారు. పుదుచ్చేరి నియోజకవర్గంలోని యానాం ప్రాంతం భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లాలో అంతర్భాగమన్నారు. విభజనతో సంబంధంలేకుండా యానాంకి ఎప్పట్లాగానే సహాయ సహకారాలను కొనసాగిస్తామని చెప్పారు.

అశోక్ బాబు హెచ్చరిక

సమ్మె తమ ఆఖరి అస్త్రమని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హైదరాబాదులో అన్నారు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు అసాధ్యమన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం పార్టీలకు అతీతంగా విభజనకు వ్యతిరేకంగా ఓటేస్తామని ఎమ్మెల్యేలు మాట ఇచ్చారని, అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చాక ఎమ్మెల్యేలు మాట తప్పితే అప్పటికప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

రాష్ట్ర విభజన, సరిహద్దుల రూపకల్పన, ఉమ్మడి రాజధాని, ఆర్టికల్ 371(డి) అంశాలపై కేంద్రం చక్రబంధంలో చిక్కుకుందని, విభజనపై కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శించారు. కేంద్రం విధానాల్ని చూస్తుంటే ప్రస్తుత శీతాకాల సమావేశంలో టి.బిల్లు పార్లమెంట్‌కు వచ్చే పరిస్థితులు కనబడడం లేదన్నారు. ఉద్యమ కార్యాచరణ రూపొందించడానికి తన ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని సమైక్య ఐకాస నిర్ణయించిందన్నారు.

English summary

 The APNGOs’ Association on Sunday threatened to go on a flash strike, if the Centre refers the Telangana Draft Bill to the Legislative Assembly and Parliament for approval.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X