వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ పై విచారణా ? రాష్ట్రపతికి, కేంద్రానికి లేఖలపై చర్చ !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తోన్నవేళ హై కోర్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో హైకోర్టులో కరోనా పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ప్రధాన న్యాయమూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆయన తీరు వల్లే చాలామంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, కోర్టును మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆలిండియా బీసీ ఫెడరేషన్ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు పత్రికలలో వచ్చిన కథనంపై చర్చ జరుగుతుంది .

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలాఅచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలా

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అంతర్గత విచారణ ?

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై అంతర్గత విచారణ ?

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, మరియు సుప్రీం న్యాయమూర్తులకు రాష్ట్రంలోని పరిస్థితిని వివరిస్తూ, హైకోర్టు సీజే పై అంతర్గత విచారణకు ఆదేశించాలని కోరుతూ లేఖలు రాసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ నిర్లక్ష్యపు చర్యల వల్లే, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే చాలా మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఆయన తన లేఖలో పేర్కొన్నారని ప్రచారం జరుగుతుంది.ఇక ఈ వార్తను ఒక ప్రధాన పత్రిక ప్రచురించటంతో చర్చకు దారి తీసింది .

నాలుగు పేజీల లేఖ రాసిన బీసీ ఫెడరేషన్

నాలుగు పేజీల లేఖ రాసిన బీసీ ఫెడరేషన్

నాలుగు పేజీల లేఖ రాసిన బీసీ ఫెడరేషన్ న్యాయస్థానాలకు వచ్చే న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, వివిధ కేసుల నిమిత్తం వస్తున్న కక్షిదారుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టులో కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుతం అలాంటి చర్యలేవీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది . దీనిపై విచారణ జరపాలని హైకోర్టు, కింది కోర్టులకు కరోనా రక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని, మార్గదర్శకాలు విడుదల చేయాలని కూడా లేఖలో పేర్కొన్నట్టు సమాచారం .

 కరోనా వ్యాప్తి విషయంలో సీజేపై అభియోగాలు

కరోనా వ్యాప్తి విషయంలో సీజేపై అభియోగాలు

క్రిక్కిరిసిన హాల్లో ప్రమాణస్వీకారం చేయడం వల్లనే చాలామందికి కరోనా సోకిందని. మే 8వ తేదీన మూసి ఉన్న చిన్న ఎయిర్ కండీషన్ హాల్లో ముగ్గురు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం జరిగిందని,హాల్ అంతా న్యాయమూర్తుల కుటుంబాలు, న్యాయవాదులు, అక్కడ పనిచేసే సిబ్బంది, వీఐపీలతో క్రిక్కిరిసి పోయిందని , ఇక ఈ కార్యక్రమంలో భౌతిక దూరం పాటించలేదని మాస్కులు కూడా ధరించలేదని అందుకే కరోనా కేసులు హైకోర్టు ఉద్యోగుల్లో పెరిగాయని పలు విషయాలపై అభియోగాలు సీజే పై మోపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

ఏపీ హైకోర్టు ఈ వ్యవహారంలో స్పందిస్తుందా ?

ఏపీ హైకోర్టు ఈ వ్యవహారంలో స్పందిస్తుందా ?

ఇన్ఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే . ఆయన ద్వారా చాలామంది కరోనా బాధితులు గా మారారని, హైకోర్టులో ఇంతమంది న్యాయవాదులకు, సిబ్బందికి కరోనా రావడానికి సీజే నిర్లక్ష్యం కారణమని ఆరోపిస్తూ ఆయనపై అంతర్గత విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలు రాయటంపై సీజే ఎలా స్పందిస్తారో ? ఏపీ హైకోర్టు ఈ వ్యవహారంలో ఏమంటుందో వేచి చూడాలి .

English summary
In Andhra Pradesh, coronavirus cases are reported to have been increasing . employees of the High Court also suffering with corona. All india BC Federation working president Hansaraj complained to the center about the negligency of Chief justice and asked to do an internal inquiry .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X